భర్త చనిపోయిన ఓ మహిళ వేరొక వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుందని ఆరోపణలు చేస్తూ గ్రామస్తులు సదరు మహిళను కొట్టడమే కాకుండా, ఆమెకు శిరోముండనం చేసి దారుణంగా అవమానించిన ఘటన గుజరాత్ లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. గుజరాత్‌లోని శబర్‌కాంత జిల్లాలోని సంచేరి గ్రామానికి చెందిన ఓ మహిళకు ఇటీవలే భర్త చనిపోయాడు.ఈ క్రమంలోనే తన నలుగురు పిల్లలను పోషించుకుంటూ జీవనం కొనసాగిస్తుంది.
ఈ క్రమంలోనే బ్యాంకు పని నిమిత్తం హిమ్మత్‌నగర్ వెళ్లిన ఆ వితంతువు తిరిగి ప్రయాణంలో తనకు తెలిసిన వ్యక్తి ద్విచక్రవాహనంపై వచ్చింది.ఈ క్రమంలోనే అదే గ్రామస్తులు తనని అడ్డుకుని వారిద్దరికీ అక్రమ సంబంధం ఉందంటూ ఆరోపించిన వారిద్దరిని గ్రామానికి తీసుకువెళ్ళి సదరు మహిళ పట్ల ఎంతో దారుణంగా ప్రవర్తించడమే కాకుండా ఆమెను చితకబాది శిరోముండన చేశారు.
ఈ మేరకు సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. బాధితురాలు ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసి ఆమెపై దాడికి ప్రయత్నించిన ఇద్దరు మహిళలు, నలుగురు పురుషులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసు విచారణలో భాగంగా బైక్ పై ఎక్కించుకుని వచ్చిన వ్యక్తి నిందితుల్లో ఒకరి సోదరికి భర్తగా పోలీసులు గుర్తించారు. ఈ క్రమంలోనే వారిద్దరికీ అక్రమ సంబంధం ఉందన్న కారణంగా వారిపట్ల ఈ విధంగా ప్రవర్తించారని పోలీసులు పేర్కొన్నారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…