రోజు రోజుకూ సైబర్ నేరగాళ్ల ఆగడాలు మితిమీరి పోతున్నాయి. ఎన్నో ఎత్తులు వేసి ఎంతో మంది అమాయకులను తమ బుట్టలో వేసుకుని రూ.లక్షలకు లక్షలు డబ్బు పోగు చేసుకుంటున్నారు. ఇప్పటికే ఎంతోమంది సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయినప్పటికీ మళ్లీ మళ్లీ అవే తప్పులు చేస్తూ మోసపోతున్నారు. తాజాగా ఇలాంటిదే ఓ సంఘటన హైదరాబాద్‌లో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే..
హైదరాబాద్ బాలానగర్ పీఎస్ పరిధిలో ఆర సాయికుమార్ అనే వ్యక్తి ఐసీఐసీఐ బ్యాంకులో ఉద్యోగం చేస్తున్నాడు. ఈ క్రమంలోనే ఆ ఉద్యోగం కన్నా ఉన్నత స్థాయి ఉద్యోగం కోసం సాయికుమార్ నౌకరీ డాట్ కామ్ లో గత రెండు రోజుల క్రితం తన ప్రొఫైల్ అప్‌లోడ్ చేశాడు. సాయి కుమార్ కు ఓ మహిళ ఫోన్ చేసి తాను నౌకరి డాట్ కామ్ నుంచి మాట్లాడుతున్నానని చెప్పి, ఆమె పంపిన లింక్ కి కేవలం 10 వేల రూపాయలు మాత్రమే పంపించమని చెప్పింది.
ఈ క్రమంలోనే సాయి కుమార్ ఆ లింక్ ఓపెన్ చేసి ఆమెకు రూ.10,000 పంపించేలోగా ఏకంగా తన ఖాతా నుంచి అక్షరాలా రూ.25,314 మాయమయ్యాయి. ఈమేరకు డబ్బు డెబిట్ అయినట్టు మెసేజ్ రావడంతో తాను మోసపోయానని గ్రహించిన సాయికుమార్ పోలీసులను ఆశ్రయించాడు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో తెలియడంతో ఒక బ్యాంకు ఉద్యోగి అయి ఉండి కూడా ఈ విధంగా సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోవడం విడ్డూరం అంటూ కామెంట్ చేస్తున్నారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…