ప్రైవేటు స్కూళ్ల ఆగడాలకు పరాకాష్ట ఈ సంఘటన. స్కూల్ ఫీజు కట్టలేదని ఆ బాలికను ఆ స్కూల్ ప్రిన్సిపాల్ స్కూల్‌లో అందరి ముందు అవమానించాడు. ఆ అవమాన భారం భరించలేని బాలిక ఇంటికి వచ్చి స్పృహ తప్పి పడిపోయి మృతి చెందింది. దీంతో ఆ స్కూల్ ప్రిన్సిపాల్‌పై ఆ బాలిక తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..
ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నావ్ జిల్లాలో ఉన్న ఉన్నావ్ సిటీ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదర్శ్ నగర్ లో ఓ కుటుంబం నివసిస్తోంది. వారి 15 ఏళ్ల కుమార్తె స్థానికంగా ఉన్న ఏబీ నగర్‌లోని సరస్వతి విద్యా మందిర్‌లో 10వ తరగతి చదువుతోంది. అయితే ఆ బాలిక తల్లిదండ్రులు స్కూల్ ఫీజు చెల్లించలేదు. దీంతో ఆ బాలికపై స్కూల్ యాజమాన్యం ఒత్తిడి తెచ్చింది.
ఇక తాజాగా ఆ బాలికను పిలిపించిన స్కూల్ ప్రిన్సిపాల్ ఆమెను అందరి ముందు అవమానించాడు. ఫీజు కట్టలేదని ఎగతాళి చేశాడు. దీంతో తీవ్ర మనోవేదనకు గురైన ఆ బాలిక ఏడుస్తూ ఇంటికి వచ్చింది. ఆమె ఆ అవమాన భారాన్ని భరించలేకపోయింది. ఆమె ఇంటికి వస్తూనే స్పృహ తప్పి పడిపోయింది. దీంతో ఆ బాలికను ఆమె తల్లిదండ్రులు హాస్పిటల్‌లో చేర్పించారు. అయితే ఆ బాలిక చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈ క్రమంలో వారు ఆ ప్రిన్సిపాల్‌పై పోలీసులకు ఫిర్యాదు చేయగా, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
అయితే ప్రిన్సిపాల్ కథనం మాత్రం మరోలా ఉంది. తాము ఎల్లప్పుడూ ఫీజు విషయాలను తల్లిదండ్రులతోనే చర్చిస్తామని, విద్యార్థులపై ఒత్తిడి తేమని, ఆ బాలిక తల్లిదండ్రులు రూ.2000 ఫీజును చెల్లించారని, అలాంటిది మళ్లీ ఎలా అడుగుతామని అన్నాడు. ఆ బాలికకు ముందు నుంచే అనారోగ్య సమస్యలు ఉన్నాయని, అందుకనే ఆమె చనిపోయి ఉంటుందని.. తెలిపాడు. అయితే పోలీసులు మాత్రం కేసును విచారిస్తున్నారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…