కొన్ని రకాల ప్రత్యేకమైన పాములను ఇంట్లో ఉంచుకున్నా, వాటికి పూజలు చేసినా అదృష్టం, ధనం కలసి వస్తాయని ఇప్పటికీ కొందరు నమ్మేవారు ఉన్నారు. అలాంటి వారినే లక్ష్యంగా చేసుకుని కొందరు అరుదైన జాతికి చెందిన పాములను స్మగ్లింగ్ చేస్తున్నారు. తాజాగా ఇలాంటిదే ఓ సంఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..
ఉత్తరప్రదేశ్‌లోని దుధ్వా అటవీ ప్రాంతంలో ఎరుపు రంగులో ఉండే కొండ చిలువను స్మగ్లింగ్ చేస్తున్న నలుగురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి ఆ పామును స్వాధీనం చేసుకుని అటవీ శాఖ అధికారులకు అప్పగించారు. ఆ వ్యక్తులను పోలీసులు శాలు కశ్యప్, ముకేష్ కశ్యప్, సందీప్ సింఘాలలుగా గుర్తించారు. వీరికి అఫ్సర్ అనే డ్రైవర్ సహకారం అందించాడు. వారు ఆ పామును ఓ కారులో స్మగ్లింగ్ చేస్తుండగా పోలీసులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుని అరెస్టు చేశారు.
వారందరూ ఢిల్లీకి చెందిన వారు కాగా దుధ్వా అటవీ ప్రాంతానికి సమీపంలో ఉన్న ఖెరి అనే గ్రామంలో వారు ఆ పామును స్థానికంగా ఉన్న ఓ వ్యక్తి నుంచి రూ.10 లక్షలకు కొన్నారు. దాన్ని ముంబైలో రూ.50 లక్షలకు అమ్మాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే వారు పోలీసులకు పట్టుబడ్డారు.
కాగా ఎరుపు రంగులో ఉండే ఆ కొండ చిలువ తోక కూడా తలలాగే ఉంటుంది. దీంతో దాన్ని మొదటి సారి చూస్తే దానికి రెండు తలలు ఉన్నాయేమోనని ఎవరైనా సరే అనుకుంటారు. ఇక ఈ పాములకు చైనాతోపాటు పలు ఆసియా దేశాల్లో మంచి డిమాండ్ ఉంది. వీటిని ఇంట్లో పెట్టుకుంటే ధనవంతులు అవుతారని కొందరు ఇప్పటికీ విశ్వసిస్తున్నారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…