ఎన్నో ఆశలతో వివాహ బంధం ద్వారా కొత్త జీవితంలోకి అడుగుపెట్టింది. తన భర్తతో కలిసి సంతోషంగా జీవించాలని ఎన్నో కలలు కన్న ఆ వధువు కలలు ఆవిరైపోయాయి. పెళ్లయిన మూడు నెలలకే ఆ వధువు తీసుకున్న నిర్ణయం కుటుంబ సభ్యులకు కడుపుకోతగా మిగిల్చింది. ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ సంగారెడ్డి జిల్లా కంగ్టి మండలంలోని ఓ తండాలో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే..
సంగారెడ్డి జిల్లా కంగ్టి మండలంలోని ఓ తండాకు చెందిన పీనాబాయి జుక్కల్ మండలం దోస్త్‌పల్లి తండాకు చెందిన వీరేశంతో మూడు నెలల క్రితం వివాహం జరిగింది. ఎన్నో ఆశలతో నవవధువు అత్తారింట్లో అడుగుపెట్టింది.తన కూతురి జీవితం సంతోషంగా సాగిపోతుందనుకున్న క్రమంలో నవవధువు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుని మరణించిన వార్త తెలియగానే ఆ తల్లిదండ్రులు కుప్పకూలిపోయారు.
ఈ క్రమంలోనే ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పీనాబాయి మృతదేహాన్ని పోస్ట్‌మార్టమ్ నిమిత్తం బాన్సువాడ ప్రాంతీయ ఆస్పత్రికి తరలించారు. తన కూతురుది ఆత్మహత్య కాదని,తను ఆత్మహత్య చేసుకోలేదని అదనపు కట్నం కోసం అత్తింటివారు తనని హత్య చేశారని యువతి తల్లిదండ్రులు ఆరోపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు పీనాబాయి అత్తింటి వారి పై కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…