కేవలం చేతబడి చేస్తున్నాడన్న అనుమానం రావడంతో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. వరుసకు స్వయాన అల్లుడు అయినటువంటి వ్యక్తి చేతిలో మామ దారుణంగా హత్య చేయబడ్డాడు. ఈ విధంగా మామను హత్య చేసి ఎవరికీ అనుమానం రాకుండా రాత్రికి రాత్రి దహన సంస్కారాలు చేసిన ఘటన విజయనగరం జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు..
మక్కువ మండలం పనసభద్ర గ్రామంలో కేండ్రుక ఉత్తర(57) అనే వ్యక్తి పొలంలో పని చేస్తున్న తన భార్యకోసం భోజనం తీసుకుని వెళుతున్నాడు. అయితే తన మామ చేతబడి చేస్తూ తమ కుటుంబాన్ని నాశనం చేయదలచాడని, అదే గ్రామానికి చెందిన కొండ తామర నారప్ప అనే యువకుడు ఎలాగైనా తన మామకు బుద్ధి చెప్పాలని భావించాడు. ఈ క్రమంలోనే పొలం వద్దకు తన భార్యకు భోజనం తీసుకెళ్తున్న ఉత్తరను చంపడానికి ఇదే అనువైన సమయమని భావించిన నారప్ప అతనిని వెంబడించాడు.
ఈ క్రమంలోనే ఉత్తర తన చెర నుంచి తప్పించుకోవడానికి పరుగులు తీశాడు. ఇలా పరుగులు తీసిన తన మామను గ్రామానికి దూరంలో ఉన్న ఒక జీడి తోటలో తలపై బలంగా కొట్టడంతో ఉత్తర అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఈ క్రమంలోనే ఈ సంఘటనపై ఎవరికీ అనుమానం రాకుండా రాత్రికి రాత్రే తన మామకి దహన సంస్కరణలు నిర్వహించాడు. ఈ విధంగా తన తండ్రి మరణాన్ని జీర్ణించుకోలేని అతని కుమారులు ఈ విషయాన్ని పోలీసులకు చేరవేయడంతో పోలీసులు విచారణ చేపట్టగా అసలు నిందితుడు బయటపడటంతో అతనిపై కేసు నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…