పెళ్లిళ్లు చేసుకుని హాయిగా, సంతోషంగా సాగిపోతున్న భార్యా భర్తల జీవితాల్లోకి మూడవ వ్యక్తి రావడంతో ఆ జీవితం చెల్లాచెదురు అయింది.ఈ క్రమంలోనే భర్తకు తెలియకుండా భార్య, భార్యకు తెలియకుండా భర్త ఇతర వ్యక్తులతో వివాహేతర సంబంధాలు పెట్టుకోవడం వల్ల ఎంతో అన్యోన్యంగా సాగిపోతున్న భార్య భర్తల మధ్య వివాదాలు తలెత్తుతూ చివరికి ప్రాణాలు తీసుకుంటున్న ఘటనలు కూడా చోటుచేసుకుంటున్నాయి. ఇప్పటికే ఈ విధమైన వార్తలు ఎన్నింటినో మనం చదివి ఉన్నాం. తాజాగా ఇలాంటి ఘటన మరొకటి చోటు చేసుకుంది.
కాప్రాలోని వంపుగూడకు చెందిన ఓ మహిళ (48) తన భర్త, కుమారుడు, మనవరాలితో కలిసి నివాసం ఉంటోంది. గత 10 సంవత్సరాల క్రితం ఆమె ఒక హోటల్ లో పని చేసింది. కాగా ఆ హోటల్ లో పనిచేస్తున్న సమయంలో ఆమెకు తనకన్నా వయసులో 12 సంవత్సరాల చిన్నవాడైన అశోక్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. దీంతో ఆ వ్యక్తితో సహజీవనం చేస్తోంది. ఈ విధంగా వారిద్దరి మధ్య పరిచయం ఏర్పడి అక్రమ సంబంధానికి దారి తీసింది. సదరు మహిళతో కలిసి జీవించడం కోసం అశోక్ మరొక ఇంటిని అద్దెకు తీసుకున్నాడు.
ఈ విషయం అశోక్ భార్యకు తెలియడంతో తన భర్తను నిలదీసింది. దీంతో ఆమె అశోక్ కు దూరమైంది. అయితే ఆమె మరొకరికి దగ్గర కావడాన్ని అతను చూసి ఓర్చుకోలేక పోయాడు. ఈ క్రమంలోనే తనని ఎలాగైనా చంపాలని పథకం వేసిన అశోక్ ఐదవ తేదీ తనని రూమ్ కి రమ్మని ఫోన్ చేశాడు. అశోక్ నుంచి ఫోన్ రాగానే.. చికెన్ తీసుకు వస్తానని చెప్పి బయటకు వెళ్లింది. అనంతరం తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఈ నేపథ్యంలోనే అశోక్ పై అనుమానాలు వ్యక్త పరచగా పోలీసులు అతనిని కస్టడీలోకి తీసుకుని తమదైన శైలిలో విచారణ చేపట్టారు. అసలు విషయం బయట పడింది. తనతో ఎంతో సన్నిహితంగా ఉండి మరొకరితో అక్రమ సంబంధం పెట్టుకోవడం వల్ల తనని గొంతునులిమి చంపానని అశోక్ ఒప్పుకోవడంతో పోలీసులు అతనిని కస్టడీలోకి తీసుకున్నారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…