ప్రస్తుత తరుణంలో రోజు రోజుకూ ప్రభుత్వాలు ఎన్నో చట్టాలు చేస్తున్నప్పటికీ కొన్ని విషయాలలో మాత్రం మనుషులు మూర్ఖంగా ప్రవర్తిస్తున్నారు. ముఖ్యంగా పరువు కోసం ప్రజలు ఎంతో తాపత్రయ పడుతున్నారు. ఇంటి పరువు పోతుంది అంటే సొంత వాళ్లను కూడా చంపడానికి వెనకాడటం లేదు. ఎంతో పెద్ద పెద్ద చదువులు చదువుకున్న వాళ్లు సైతం పరువు కోసం హత్య చేసే స్థాయికి దిగజారుతున్నారు. తాజాగా ఇలాంటి పరువు హత్య ఒకటి ఉత్తరప్రదేశ్‌లో చోటు చేసుకుంది. పూర్తి వివరాల లోకి వెళ్తే..
ఉత్తరప్రదేశ్‌లోని మీరట్ సర్ధనా ప్రాంతంలో మృతురాలి తల్లి షహనో తన భర్త నుంచి విడాకులు తీసుకొని వేరొక వ్యక్తిని పెళ్లి చేసుకుంది. ఈ క్రమంలోనే తన మొదటి భర్త సంతానమైన ఆరీఫ్, సమ్రీన్ తన తండ్రి సంరక్షణలోనే పెరుగుతున్నారు. కాగా సమ్రీన్ స్థానికంగా ఉన్న ఒక వ్యక్తితో ఎంతో చనువుగా మెలుగుతూ ఉండేది. ఇది చూసిన కుటుంబ సభ్యులు ఆమె ప్రవర్తన మార్చుకోవాలంటూ ఆమెను గట్టిగా హెచ్చరించారు.
తమ కుటుంబ సభ్యులు హెచ్చరించినప్పటికీ వారి మాట పెడచెవిన పెట్టి అతనితో ఎంతో సన్నిహితంగా మెలుగుతున్న సమ్రీన్ పై ఆమె అన్న ఆరీఫ్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిద్రపోతున్న ఆమెపై నాటు తుపాకీతో కాల్పులు జరిపి అనంతరం అక్కడి నుంచి పోలీస్ స్టేషన్ కి వెళ్లి స్వయంగా లొంగిపోయాడు. ఈ క్రమంలోనే అతనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు అతనిని కస్టడీలోకి తీసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…