హైదరాబాద్‌లోని హయత్ నగర్ లో ఓ దారుణం చోటు చేసుకుంది. కట్టుకున్న భార్య మృతదేహాన్ని భర్త ఒక దుప్పట్లో చుట్టి సమీపంలో ఉన్న బాతుల చెరువు అలుగు వద్ద పడేయటం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఈ విషయాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించి విచారణ చేపట్టారు.
పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. హయత్‌నగర్ పాత రోడ్డుకు సమీపాన హనుమాన్ మందిరం పక్కనే ఉన్న గల్లీలో డేగ శ్రీను, లక్ష్మీ దంపతులు నివసిస్తున్నారు. వీరికి ఒక కుమారుడు, కుమార్తె సంతానం ఉన్నారు. వీరు అద్దె ఇంట్లో నివాసం ఉండేవారు. ఈ క్రమంలోనే గురువారం రాత్రి 11 గంటల సమయంలో శ్రీను, అతని స్నేహితుడు వినోద్ కలిసి తన భార్య లక్ష్మి మృతదేహాన్ని దుప్పటిలో చుట్టి సమీపంలోని చెరువు వద్ద పడవేయడాన్ని స్థానికులు గమనించారు.
ఈ విషయాన్ని పోలీసులకు చేరవేయడంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. మృతదేహాన్ని అక్కడ పడేయటానికి కారణం ఏంటని పోలీసులు ఆరా తీయగా.. తన భార్య గత కొంత కాలం నుంచి అనారోగ్యంతో బాధపడుతుందని, అనారోగ్యం కారణంగానే తన భార్య మృతి చెందడంతో దహన సంస్కారాలు నిర్వహించడానికి డబ్బులు లేక ఇలా చేశానని చెప్పాడు. అయితే పోలీసులు అతని ఇంటిని పరిశీలిస్తూ ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు. కేవలం అనారోగ్యం కారణంగానే మృతి చెందిందా లేక మరేదైనా జరిగిందా ? అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…