కూతురు ప్రేమించిన వ్యక్తిని ఇంట్లో తెలియకుండా పెళ్లి చేసుకుందన్న కోపంతో ఓ తల్లి దారుణానికి పాల్పడింది. ఈ క్రమంలోనే కూతురుపై కోపంతో ఆమెకు కడుపుకోత మిగిల్చింది. ఈ ఘటన తమిళనాడులో చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. కోయంబత్తూర్ కి చెందిన నాగలక్ష్మి అనే మహిళ కూతురు అదే ప్రాంతానికి చెందిన మరొక యువకుడిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. అయితే తన కూతురి ప్రేమ పెళ్లి ఇష్టం లేని ఆ తల్లి తన కూతురు, అల్లుడుపై పగ పెంచుకుంది.
ఇలా ప్రేమించి పెళ్లి చేసుకున్న తన కూతురు, ఆమె భర్తకు మధ్య విభేదాలు రావడంతో వీరిద్దరూ కొంతకాలానికి విడిపోయారు. అప్పటికే తన కూతురికి తొమ్మిది నెలల కుమారుడు ఉండడంతో నాగలక్ష్మి కూతురు తన కొడుకుని తీసుకొని తల్లి ఇంటికి చేరుకుంది. ఇప్పటికే తన కూతురు ప్రేమ వివాహం చేసుకుని తమ పరువు తీసిందని ఎంతో బాధ పడిన తల్లి తన కూతురికి రెండో పెళ్ళి చేయాలంటే ఆమె కొడుకు అడ్డుగా ఉన్నాడని భావించింది.
ఈ క్రమంలోనే ఆమె కొడుకు అడ్డు తొలగిపోతే తన కూతురుకి రెండవ పెళ్ళి చేయాలని భావించిన ఆ తల్లి తన కూతురు లేని సమయంలో తొమ్మిది నెలల తన మనవడి నోట్లో బిస్కెట్ ప్యాకెట్ కుక్కి చంపింది. ఇలా బాబు మరణించిన తర్వాత తనకు ఏమీ తెలియదు అన్నట్టుగా పడుకోబెట్టింది. అయితే మరణించిన బాబుకి పోస్ట్ మార్టం నిర్వహించడంతో అసలు విషయం బయట పడింది. తన మనవడి పట్ల అంత దారుణంగా ప్రవర్తించిన ఆమెను పోలీసులు అరెస్టు చేశారు.