ఓ యువకుడి వేధింపులు తాళలేక పదో తరగతి విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. ప్రతి రోజూ ఆ యువకుడు తనను ప్రేమించాలంటూ సదరు బాలికపై అధిక ఒత్తిడి తీసుకురావడంతో అతని వేధింపులు భరించలేని బాలిక ఇంట్లో తల్లిదండ్రులు లేని సమయం చూసి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించింది. ఈ ఘటన తెలంగాణలోని ఖమ్మం జిల్లాలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు..
ఖమ్మం రూరల్ మండలం వెంకటగిరికి చెందిన పదో తరగతి బాలికపై సాయి అనే యువకుడు నిత్యం తనను ప్రేమించాలంటూ మానసిక వేధింపులకు గురి చేసేవాడు. ఈ క్రమంలోనే ఈనెల 9వ తేదీ ఆమెపై అధికంగా ఒత్తిడి చేయడంతో ఎంతో మానసిక వేదన అనుభవించిన విద్యార్థిని తట్టుకోలేక తన తల్లిదండ్రులు పొలానికి వెళ్లిన సమయంలో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. ఈ విషయం గమనించిన స్థానికులు విషయాన్ని తల్లిదండ్రులకు చేరవేయడంతో తల్లిదండ్రులు చికిత్స నిమిత్తం ఆమెను ఆస్పత్రికి తరలించారు.
ఈ విధంగా ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్న ఆ యువతి శుక్రవారం సాయంత్రం మరణించడంతో పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ మొదలుపెట్టారు. ఈ క్రమంలోనే బాలికపై వేధింపులను తట్టుకోలేక ఆత్మహత్య తెలుసుకుందని తెలుసుకున్న పోలీసులు నిందితుడు సాయిని అదుపులోకి తీసుకున్నారు.