క్రైమ్‌

అత్తింటి నుంచి పుట్టింటికి వచ్చిన నవవధువు.. దారుణమైన శిక్ష వేసిన పుట్టిల్లు..

సాధారణంగా అమ్మాయిలకు పెళ్లి వయసు రాగానే పెళ్లి చేసి అత్తారింటికి పంపిస్తారు. అక్కడ తన కూతురు జీవితం సంతోషంగా ఉండాలని ప్రతి ఒక్క తల్లిదండ్రి భావిస్తారు.దురదృష్టవశాత్తు అత్తారింట్లో కూతురి జీవితం బాగాలేకపోతే తల్లిదండ్రులు తమ కూతురిని ఆదరించి తనకు చేదోడువాదోడుగా నిలబడతారు. కానీ మధ్యప్రదేశ్ కు చెందిన తల్లిదండ్రులు తన కూతురు పట్ల కనికరం కూడా లేకుండా ఆమె పట్ల ఎంతో క్రూరంగా ప్రవర్తించారు.కేవలం అత్తారింటి నుంచి పారిపోయి వచ్చిందనే కారణంతో ఏమాత్రం మానవత్వం లేకుండా ఆమెను గొడ్డును బాదినట్టు బాదిన ఘటన మధ్యప్రదేశ్ లో చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే..

అలీరాజ్‌పూర్ జిల్లా భోరి పోలీస్ స్టేషన్ పరిధిలోని భడీ ఫౌల్ తల్వా అనే గిరిజన గ్రామంలో జూన్ 28న ఈ ఘటన చోటు చేసుకుంది. బాధిత యువతికి మూడు నెలల కిందట వివాహం జరిగింది. పెళ్లయిన మూడు నెలలకే అత్తారింటి నుంచి పుట్టింటికి పారిపోయి రావడంతో ఆమె తల్లిదండ్రులు సోదరులు బంధువులు ఆమె పట్ల ఎంతో రాక్షసంగా ప్రవర్తించారు.అసలు అత్తారింట్లో తనకే సమస్య ఉందని కూడా అడగకుండా అత్తారింటికి నుంచి పారిపోయి వచ్చినందుకు ఆమె పట్ల ఎంతో దారుణంగా ప్రవర్తించి ఆమెను చితకబాదారు.

ఆమె తల్లిదండ్రులు యువతి జుట్టు పట్టుకుని బయటకు ఈడ్చుకెళ్లి ఒక చెట్టుకు కట్టి కర్ర విరిగే వరకు గొడ్డును బాదినట్లు బాదారు. వారి కొడుతుంటే ఆమె ఆర్తనాదాలు చేస్తోంది. అయితే ఈ సంఘటనను చూడటానికి చుట్టూ ఎంతో మంది ఉన్నారు కానీ ఎవరో కూడా ఈ దారుణాన్ని ఆపటానికి ప్రయత్నించలేదు. పైగా ఈ సంఘటనను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ వీడియో చూసిన పోలీసులు బాధిత యువతి నుంచి ఫిర్యాదు తీసుకుని తన తల్లిదండ్రుల పై కేసు నమోదు చేసుకున్నారు.అదే విధంగా తన అత్తారింటి నుంచి పారిపోయి రావడానికి గల కారణాలను కూడా పోలీసులు విచారిస్తున్నట్లు తెలిపారు.

Share
Sailaja N

Recent Posts

టెన్త్‌, ఇంట‌ర్‌, డిప్లొమా చ‌దివిన వారికి ఉద్యోగాలు.. ఆన్‌లైన్‌లో అప్లై చేయండి..!

అస్సాం రైఫిల్స్ వారు ప‌లు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టుల‌ను భ‌ర్తీ చేసేందుకు గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల…

Friday, 14 March 2025, 10:39 AM

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

బ్యాంకుల్లో ఉన్న‌త స్థానాల్లో ఉద్యోగం చేయాల‌ని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బ‌రోడా గొప్ప అవ‌కాశాన్ని క‌ల్పిస్తోంది. ఆ…

Sunday, 2 March 2025, 2:33 PM

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిర‌ప‌డాల‌ని అనుకుంటున్న వారి కోసం యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…

Saturday, 22 February 2025, 10:19 AM

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

ప‌బ్లిక్ సెక్టార్‌కు చెందిన భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి,…

Friday, 21 February 2025, 1:28 PM

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

దేశంలోని ప్ర‌ముఖ ప‌బ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బ‌రోడా ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ప‌లు…

Thursday, 20 February 2025, 5:38 PM

టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..

రైల్వేలో ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభ‌వార్త చెప్పింది. ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…

Tuesday, 18 February 2025, 5:22 PM

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.40వేలు జీతం.. ఇంట‌ర్ అర్హ‌త‌తో..!

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ప‌నిచేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవ‌కాశం అని చెప్ప‌వ‌చ్చు. ఇండియ‌న్ ఎయిర్…

Monday, 17 February 2025, 9:55 PM

పోస్ట‌ల్ శాఖ‌లో 45వేల ఉద్యోగాలు.. రాత ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ లేకుండానే ఎంపిక‌.. టెన్త్ చ‌దివితే చాలు..!

పోస్ట‌ల్ శాఖ‌లో ఉద్యోగం చేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఈ స‌ద‌కాశం మీకోస‌మే. త‌పాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…

Monday, 17 February 2025, 3:09 PM