సాధారణంగా అమ్మాయిలకు పెళ్లి వయసు రాగానే పెళ్లి చేసి అత్తారింటికి పంపిస్తారు. అక్కడ తన కూతురు జీవితం సంతోషంగా ఉండాలని ప్రతి ఒక్క తల్లిదండ్రి భావిస్తారు.దురదృష్టవశాత్తు అత్తారింట్లో కూతురి జీవితం బాగాలేకపోతే తల్లిదండ్రులు తమ కూతురిని ఆదరించి తనకు చేదోడువాదోడుగా నిలబడతారు. కానీ మధ్యప్రదేశ్ కు చెందిన తల్లిదండ్రులు తన కూతురు పట్ల కనికరం కూడా లేకుండా ఆమె పట్ల ఎంతో క్రూరంగా ప్రవర్తించారు.కేవలం అత్తారింటి నుంచి పారిపోయి వచ్చిందనే కారణంతో ఏమాత్రం మానవత్వం లేకుండా ఆమెను గొడ్డును బాదినట్టు బాదిన ఘటన మధ్యప్రదేశ్ లో చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే..
అలీరాజ్‌పూర్ జిల్లా భోరి పోలీస్ స్టేషన్ పరిధిలోని భడీ ఫౌల్ తల్వా అనే గిరిజన గ్రామంలో జూన్ 28న ఈ ఘటన చోటు చేసుకుంది. బాధిత యువతికి మూడు నెలల కిందట వివాహం జరిగింది. పెళ్లయిన మూడు నెలలకే అత్తారింటి నుంచి పుట్టింటికి పారిపోయి రావడంతో ఆమె తల్లిదండ్రులు సోదరులు బంధువులు ఆమె పట్ల ఎంతో రాక్షసంగా ప్రవర్తించారు.అసలు అత్తారింట్లో తనకే సమస్య ఉందని కూడా అడగకుండా అత్తారింటికి నుంచి పారిపోయి వచ్చినందుకు ఆమె పట్ల ఎంతో దారుణంగా ప్రవర్తించి ఆమెను చితకబాదారు.
ఆమె తల్లిదండ్రులు యువతి జుట్టు పట్టుకుని బయటకు ఈడ్చుకెళ్లి ఒక చెట్టుకు కట్టి కర్ర విరిగే వరకు గొడ్డును బాదినట్లు బాదారు. వారి కొడుతుంటే ఆమె ఆర్తనాదాలు చేస్తోంది. అయితే ఈ సంఘటనను చూడటానికి చుట్టూ ఎంతో మంది ఉన్నారు కానీ ఎవరో కూడా ఈ దారుణాన్ని ఆపటానికి ప్రయత్నించలేదు. పైగా ఈ సంఘటనను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ వీడియో చూసిన పోలీసులు బాధిత యువతి నుంచి ఫిర్యాదు తీసుకుని తన తల్లిదండ్రుల పై కేసు నమోదు చేసుకున్నారు.అదే విధంగా తన అత్తారింటి నుంచి పారిపోయి రావడానికి గల కారణాలను కూడా పోలీసులు విచారిస్తున్నట్లు తెలిపారు.