సరదాగా మధ్యాహ్నం తన స్నేహితురాలితో కలిసి భోజనం చేస్తున్న ఒక దంత వైద్య విద్యార్థినిపై హత్యాయత్నం జరిగింది. పాత కక్షలను మనసులో పెట్టుకున్న యువకుడు ఈ విధంగా వైద్య విద్యార్థినిపై తుపాకీ కాల్పులు జరిపి చంపిన ఘటన కేరళ ఎర్నాకుళంలోని కొత్తమంగళం ప్రాంతంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు..
కన్నూర్ జిల్లా తలస్సేరి ప్రాంతానికి చెందిన మానస అనే యువతి కొత్తమంగళంలోని ఇందిరా గాంధీ డెంటల్ కాలేజ్‌లో వైద్య విద్యార్థిని. ఈ క్రమంలోనే ఆమె తన కాలేజీకి సమీపంలోనే ఓ ఇంటిని అద్దెకు తీసుకుని తన స్నేహితురాళ్లతో కలిసి ఉంటుంది.తలస్సేరి ప్రాంతానికి రాఖిల్ అనే యువకుడు తరచూ తన వెంటపడుతూ తనని మానసికంగా వేధించేవాడు. ఈ క్రమంలోనే మానస తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో తన తల్లిదండ్రుల అభ్యర్థన మేరకు రాఖిల్ ను వదిలిపెట్టారు. అయితే తనకు జరిగిన అవమానం పై పగ తీర్చుకోవాలని భావించిన రాఖిల్ నెల రోజుల నుంచి మానస ఉంటున్న ఇంటి పరిసరాలలోని తిరుగుతూ ఆమె కదలికలపై నిఘా పెట్టాడు.
ఈ క్రమంలోనే శుక్రవారం మధ్యహ్నం 3 గంటల సమయంలో మానస, తన స్నేహితురాలితో కలిసి మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత ఇంటిలోనికి రాఖిల్ ప్రవేశించడంతో మానస అభ్యంతరం వ్యక్తం. ఈ క్రమంలోనే ఆ యువకుడు లోపలికి తీసుకెళ్లి తలుపులు వేశాడు. ఇంతలో మానస స్నేహితురాలు విషయాన్ని ఇంటి యజమానికి చెప్పాలని పరుగులు పెట్టగానే ఇంటి నుంచి పెద్ద శబ్దం వచ్చింది. ఈ క్రమంలోనే అక్కడికి వెళ్లి చూడటంతో మానస, రాఖిల్ తుపాకితో కాల్చుకుని మరణించారు. రాఖిల్ మొదట మనసును తుపాకితో కాల్చి తనూ కాల్చుకున్నట్టు తెలుస్తోంది. కొన ఊపిరితో ఉన్న మానసును ఆస్పత్రికి తరలించగా అప్పటికే ప్రాణాలు మిగలలేదు.ఈ క్రమంలోనే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి శవాలను పోస్టుమార్టం తరలించారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…