సరదాగా పుట్టింటిలో రెండు రోజులు గడుపుదామని వచ్చిన ఆ కూతురు పుట్టింటి నుంచి అనంత లోకాలకు వెళ్లిపోయిన ఘటన దక్షిణ కన్నడ జిల్లా సుళ్య తాలూకా నెల్లూరు కేమ్రాజీ గ్రామంలో చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే…మైల్కార్ నివాసి అయిన సంగీత తన నాలుగు సంవత్సరాల కొడుకు అభిమన్యతో కలసి రెండు రోజుల క్రితం మాపలకజెలోని పుట్టింటికి వచ్చారు. ఈ క్రమంలోనే పుట్టింటిలో ఎంతో సరదాగా గడిపారు ఉదయం మెల్కార్‌కు వెళ్లాల్సి ఉంది.
ఈ క్రమంలోనే సంగీత తన కొడుకు, ఇతర కుటుంబ సభ్యులతో కలిసి విహారం కోసం చెరువు వద్దకు వెళ్లారు. ఈ క్రమంలోనే చెరువు వద్ద తన కొడుకు అభిమన్య కాలుజారి పొరపాటున నీళ్లలో పడ్డాడు. అయితే తన కొడుకును రక్షించుకోవాలన్న తపనతో సంగీత కూడా నీటిలోకి దిగింది. ఈ క్రమంలోనే ఇద్దరు నీటిలో మునిగిపోయారు.
ఈ విధంగా ఇద్దరు నీటిలో మునిగిపోవడంతో వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించడంతో వారు అక్కడికి చేరుకొని వారి కోసం గాలింపు చర్యలు చేపట్టి ఇద్దరు మృతదేహాలను వెలికి తీశారు. పుట్టింటిలో గడుపుదామని ఇక్కడికి వచ్చి ఎవరికీ అందనంత దూరానికి వెళ్ళిపోయావా అంటూ సంగీతం తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్న ఘటన పలువురి చేత కంటతడి పెట్టించింది.