సంచలన దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి సినిమా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అనేక భాషలకు చెందిన సినీ ప్రేక్షకులను ఎంతగా ఆకట్టుకుందో అందరికీ తెలిసిందే. తెలుగు సినిమా కాదు.. భారతీయ చలన చిత్ర చరిత్రలోనే అత్యధిక కలెక్షన్లను రాబట్టిన మూవీగా బాహుబలి రికార్డులు సృష్టించింది. ఈ మూవీతో నటులు ప్రభాస్, రాణాలు నేషనల్ స్టార్స్ అయ్యారు.
అయితే ఏ మూవీలో అయినా సరే చిన్న చిన్న అంశాలు చాలా ప్రాధాన్యతను సంతరించుకుంటాయి. దర్శకులు చిన్న విషయాల్లోనూ అత్యంత జాగ్రత్త వహించి సీన్లను చిత్రీకరిస్తారు. అందుకు గాను వారు అనేక రీసెర్చిలు కూడా చేస్తారు.
బాహుబలి మొదటి పార్ట్‌లో రానా (భల్లాల దేవ)కు చెందిన భారీ బంగారు విగ్రహాన్ని పెద్ద ఎత్తున సైనికులు, ప్రజలు కలిసి ప్రతిష్టిస్తారు గుర్తుంది కదా. ఆ సమయంలో విగ్రహం కింద ఎరుపు రంగు పొడి ఒకటి ఉంటుంది. సీన్ లో చూస్తే తెలుస్తుంది. అయితే ఆ ఎరుపు రంగు పొడిని ఎందుకు ఏర్పాటు చేశారో తెలుసా ?
చాలా మంది విజువల్ ఎఫెక్ట్ కోసం అలా పొడిని పెట్టుంటారు.. అని అనుకుంటారు. కానీ ఆ పొడిని అక్కడ ఉంచడం వెనుక ఉన్న కారణం అది కాదు. మరేమిటంటే..
ఒక భారీ విగ్రహాన్ని ఒక చోట ప్రతిష్టించినప్పుడు దాన్ని ఉంచే చోట సహజంగానే ఒకేసారి విగ్రహాన్ని ఆ చోట ఎత్తేసినట్లు పెట్టాల్సి వస్తుంది. దీంతో షాక్ లాంటిది వస్తుంది. చుట్టూ ఉన్న ప్రదేశాలు ప్రకంపించినట్లు అవుతాయి. అయితే ఆ షాక్ లాంటి ప్రకంపనలు రాకుండా వాటిని శోషించుకునేందుకు ఆ ఎరుపు రంగు పొడిని ఏర్పాటు చేశారు. ఇదీ ఆ పొడిని ఏర్పాటు చేయడం వెనుక ఉన్న అసలు కారణం. దర్శకులు ఇలాంటి చిన్న చిన్న విషయలను కూడా చాలా సీరియస్‌గా అమలు చేస్తుంటారు. కనుకనే అలాంటి వారు తీసే చిత్రాలు భారీగా విజయవంతం అవుతుంటాయి. బాహుబలి మూవీల విషయంలోనూ అలాగే జరిగింది. అందుకనే ఆ సినిమాలు ప్రపంచ వ్యాప్తంగా విజయం సాధించాయి.
ఇక ఆ పొడిని ఏర్పాటు చేయకుండా ఉంటే షాక్ లాంటి ప్రకంపనలు రావడంతోపాటు విగ్రహం కూడా దెబ్బ తింటుంది. ఈ రెండు కారణాల వల్లే ఆ పొడిని ఏర్పాటు చేశారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…