ప్రముఖ ఫోన్ల తయారీ కంపెనీ నోకియా 2000వ సంవత్సరంలో నోకియా 3310 ఫోన్‌ను విడుదల చేసిన విషయం విదితమే. ఈ ఫోన్‌ను అప్పట్లో బండ ఫోన్ అని కూడా పిలిచేవారు. ఎన్నిసార్లు కింద పడినా పార్ట్‌లను అతికిస్తే మళ్లీ పనిచేసేది. అందుకనే ఈ ఫోన్ అప్పట్లో చాలా పాపులర్ అయింది. అయితే ఆ ఫోన్‌ను ఓ వ్యక్తి మింగేశాడు.
కోసోవో అనే ఐరోపా దేశంలో ఉన్న ప్రిస్టినా అనే ప్రాంతానికి చెందిన 33 ఏళ్ల వ్యక్తి నోకియా 3310 ఫోన్‌ను అమాంతం మింగేశాడు. దీంతో ఆ ఫోన్ అతని పొట్టలో మూడు పార్ట్‌లుగా విడిపోయింది. బ్యాటరీ బయటకు వచ్చింది. కొన్ని గంటల పాటు ఆ బ్యాటరీ అలాగే అతని పొట్టలో ఉంటే పేలిపోయి ఉండేదని వైద్యులు తెలిపారు. కానీ ఆ వ్యక్తి ఫోన్‌ను మింగాక వెంటనే కడుపునొప్పి, వాంతులు అవుతుండడంతో హాస్పిటల్‌కు తనంతట తానుగా వచ్చాడు.
ఇక అతన్ని ఎక్స్‌రే తీశాక వాటిని చూసి వైద్యులు షాక్ తిన్నారు. అతని జీర్ణాశయంలో ఆ ఫోన్ మూడు భాగాలుగా ఉండడాన్ని గుర్తించారు. వాటిల్లో ఒకటి బ్యాటరీ. కాగా వెంటనే అతనికి శస్త్ర చికిత్స చేశారు. మొత్తం 2 గంటల పాటు ఆపరేషన్ చేసిన వైద్యులు ఎట్టకేలకు ఆ ఫోన్ భాగాలను బయటకు తీశారు. దీంతో అతనికి ప్రాణాపాయం తప్పింది.
అయితే అతను కొంచెం ఆలస్యం చేసినా అతని పొట్టలో ఉన్న ఫోన్ బ్యాటరీ పేలి ఉండేదని వైద్యులు తెలిపారు. దీంతో అతను చనిపోయి ఉండేవాడని అన్నారు. అయితే అతను ఫోన్‌ను ఎందుకు మింగాడు ? అన్న వివరాలు తెలియరాలేదు.
కాగా గతంలోనూ ఇలాంటి సంఘటనలే పలు మార్లు జరిగాయి. 2014లో కొందరు ఈ విధంగానే ఫోన్లను మింగారు. 2016లో ఓ 29 ఏళ్ల వ్యక్తి ఇలాగే ఫోన్‌ను మింగగా శస్త్ర చికిత్స చేసి ఫోన్ ను బయటకు తీశారు. ఈ విధంగా ఫోన్లను మింగడం వెనుక మానసిక అనారోగ్య కారణాలు ఉండి ఉంటాయని వైద్యులు భావిస్తున్నారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…