యంగ్ హీరో విశాల్ నటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తెలుగు, తమిళంలో ఎన్నో విజయవంతమైన సినిమాల్లో నటించి మంచి గుర్తింపు సంపాదించుకున్న విశాల్ నేడు పుట్టినరోజు జరుపుకుంటున్న సందర్భంగా తన 31 వ సినిమాకు సంబంధించిన టైటిల్ ను చిత్ర బృందం విడుదల చేశారు. ఈ క్రమంలోనే విశాల్ నటిస్తున్న 31వ చిత్రానికి “సామాన్యుడు”అనే టైటిల్ ఖరారు చేస్తూ ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేశారు.
తుపా శరవణన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ లో విశాల్ చేతిలో బేస్ బాల్ బ్యాట్ పట్టుకుని రౌడీలను కొడుతున్నట్టుగా కనిపించడంతో ఈ సినిమా మాస్ యాక్షన్ తరహాలో తెరకెక్కుతోందని తెలుస్తోంది. విశాల్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన ఈ పోస్టర్ పై భారీ అంచనాలు పెరిగాయి.
సామాన్యుడు చిత్రంలో విశాల్ సరసన టాలీవుడ్ హీరోయిన్ డింపుల్ హయతి హీరోయిన్‌గా నటిస్తోంది. విశాల్ ఫిలిం ఫ్యాక్టరీ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ సినిమాకు యువన్ శంకర్ రాజా సంగీతాన్ని సమకూర్చారు. ఇందులో పలు కీలక పాత్రలలో కోలీవుడ్ నటీనటులు సందడి చేయనున్నారు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్ర విడుదల తేదీని త్వరలోనే చిత్రబృందం వెల్లడించనున్నట్లు తెలుస్తోంది. ఇక ప్రస్తుతం విశాల్ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారడమేకాకుండా అభిమానులు తమ అభిమాన నటుడికి పెద్ద ఎత్తున పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…