అక్కినేని నాగార్జున పుట్టినరోజు సందర్భంగా తన సినిమాలకు సంబంధించిన వరుస అప్‌డేట్ లను విడుదల చేస్తూ ఎంతో సందడి చేస్తున్నారు. ఈ క్రమంలోనే నాగార్జున ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తున్న సంగతి మనకు తెలిసిందే. కాగా నాగార్జున పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా విడుదల చేశారు. అదేవిధంగా నాగార్జున నటించిన సోగ్గాడే చిన్నినాయన సినిమాకు సీక్వెల్ గా “బంగార్రాజు” సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి మనకు తెలుసు.
ఇప్పటికే ఈ చిత్రం పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. నాగార్జున పుట్టిన రోజు కావడంతో ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను నాగచైతన్య విడుదల చేశారు. ఈ పోస్టర్ లో నాగార్జున అచ్చం సోగ్గాడే చిన్నినాయన సినిమాలోని బంగార్రాజును తలపిస్తున్నారు. అంతే కాకుండా ఈ సినిమా టైటిల్ కింద “ది డెవిల్ ఈజ్ బ్యాక్ అనే క్యాప్షన్” కూడా ఉంది. ఈ క్రమంలోనే నాగార్జున, నాగచైతన్య ఉన్న పోస్టర్ ను విడుదల చేయడంతో ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఇకపోతే ఇప్పటికే పూజా కార్యక్రమాలను జరుపుకున్న ఈ సినిమా షూటింగ్ పనులను ప్రారంభించింది. ఇందులో నాగార్జున సరసన రమ్య కృష్ణ నటించగా నాగచైతన్య సరసన ఉప్పెన హీరోయిన్ కృతి శెట్టి నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్ పనులను వేగంగా పూర్తి చేసి వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారు. అయితే గత కొన్ని సంవత్సరాల నుండి ఒక్క విజయం కూడా లేని నాగార్జున ఈ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నారు. మరి ఈ సినిమాలైనా నాగార్జునకు సక్సెస్ ను అందిస్తాయో లేదో వేచి చూడాలి.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…