సినిమా ఇండస్ట్రీలో మంచి గుర్తింపును సంపాదించాలంటే ఎన్నో ఆటు పోట్లను ఎదుర్కోవలసి ఉంటుంది. వాటన్నింటినీ ఎదుర్కొన్నప్పుడు నటిగా మంచి గుర్తింపు సంపాదించుకోగలరు.మంచి గుర్తింపును సంపాదించుకున్నప్పటికీ కొన్నిసార్లు సెలబ్రిటీలకు చేదు అనుభవాలు ఎదురవుతుంటాయి. ఇలాంటి అనుభవమే ఇండస్ట్రీలో హాస్యనటిగా మంచి గుర్తింపును సంపాదించుకున్న విద్యుల్లేఖ రామన్ కి ఎదురయింది.
అల్లు అర్జున్ సరైనోడు సినిమాలో ఇడ్లీ సాంబార్ అంటూ తెరపై సందడి చేస్తూ ఎంతోమందిని ఆకట్టుకున్నారు విద్యుల్లేఖ.ఈమె తండ్రి మోహన్ రామన్ మంచి నటుడు. తండ్రి నుంచి నటనను వారసత్వంగా తీసుకున్న విద్యుల్లేఖ ఎంతో బొద్దుగా కనిపిస్తూ ఎంతో సందడి చేసేది. అయితే ఈ మధ్య కాలంలో ఎక్కువ వర్కౌట్స్ చేస్తూ బాగా సన్నబడింది. ఈ క్రమంలోనే ఈమెకు సోషల్ మీడియాలో కామెంట్లు రావడం మొదలయ్యాయట.
విద్యుల్లేఖ బరువు తగ్గడంతో ఇకపై కమెడియన్ గా చేయవా ? హీరోయిన్ గా మాత్రమే చేస్తావా ఏంటి? అని పలువురు నెటిజన్లు చేసిన కామెంట్లు ఆమెను ఎంతో బాధకు గురి చేశాయని తెలిపారు. అధిక బరువు వల్ల అనారోగ్య సమస్యలు తలెత్తాయని, అందుకోసమే తాను బరువు తగ్గితే ఈ విధంగా కామెంట్ చేస్తున్నారంటూ ఆమె తన బాధను వ్యక్తం చేశారు.కామెడీతో కూడిన లీడ్ రోల్స్ చేయడానికి తాను ఎప్పుడూ సిద్ధంగానే ఉంటానని ఈ సందర్భంగా ఆమె తెలిపారు.