ఏప్రిల్ 7 ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా సినీ తారలు రకుల్ ప్రీత్ సింగ్, విద్యాబాలన్ తమ సందేశాలను అభిమానులతో పంచుకున్నారు. ఎంతో స్లిమ్ గా ఉండే రకుల్ ప్రీత్ సింగ్, ఎంతో బొద్దుగా ఉండే విద్యాబాలన్ “మనకు మనమే ముఖ్యం అంటూ తనదైన శైలిలో అభిమానులకు సందేశం ఇచ్చారు. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా ఓ చెట్టు పై ఎక్కి ఫోటో దిగిన రకుల్ ప్రీత్ సింగ్ ఇన్స్టాగ్రామ్ ద్వారా షేర్ చేస్తూ ఈ విధంగా తెలియజేశారు.
ఆరోగ్యం అనేది బయట నుంచి మాత్రమే కాకుండా మన శరీరం లోపల ఉండటం కూడా ఎంతో ముఖ్యం అంటూ ఆమె తెలిపారు. ఎంతోమంది చాలా స్లిమ్ గా కనిపించడం కోసం జిమ్ కి వెళ్లి ఎన్నో కసరత్తులు చేస్తుంటారు. కానీ అంతర్గత ఆరోగ్యం కూడా ఎంతో ముఖ్యమని, మనసు ఆనందంగా ఉన్నప్పుడే అసలైన ఆరోగ్యం అంటూ తెలిపారు.
ఇక విద్యాబాలన్ కూడా ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా మరోసారి బరువు ప్రస్తావన తీసుకువచ్చారు.”ఆరోగ్యంలో బరువు ఒక అంశం అయితే పరవాలేదు కానీ, అదే మీ గుర్తింపు కాకూడదు అంటూ”అభిమానులకు సందేశం ఇచ్చారు. అధిక బరువు ఉన్నవారు కృంగి పోవాల్సిన పనిలేదు అన్నట్టుగా విద్యాబాలన్ అభిమానులకు తెలియజేశారు.ఈ విధంగా ఆరోగ్యం గురించి ఇద్దరు తారలు చేసిన సందేశం ఎంతో మందికి స్ఫూర్తిని కలిగించేవిగా ఉన్నాయి.