మెగా కాంపౌండ్ నుంచి ఇప్పటికి ఎంతో మంది హీరోలు ఎంట్రీ ఇచ్చి ఇండస్ట్రీలో తమ సత్తా చాటుకున్నారు. ఈ క్రమంలోనే తాజాగా మరో హీరో వైష్ణవి తేజ్ ఉప్పెన సినిమా ద్వారా ఎంట్రీ ఇచ్చారు. మొదటి సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో వైష్ణవ కు ఎన్నో అవకాశాలు వచ్చాయి. ఈ క్రమంలోనే వైష్ణవ్ రెండవ సినిమాను దర్శకుడు క్రిష్ దర్శకత్వంలో నటించారు.
మొదటి సినిమా విడుదల కాకుండానే డైరెక్టర్ క్రిష్ తో రెండవ సినిమాను ప్రారంభించారు.కొండపాలెం నవల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. ఈ సినిమాలో వైష్ణవి కి జోడిగా రకుల్ ప్రీత్ నటించింది.ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని ఆరు నెలల గడిచినప్పటికీ ఈ సినిమాకి సంబంధించినటువంటి ఏ విషయం బయటకు వినిపించడం లేదు.
ప్రస్తుతం దర్శకుడు క్రిష్ పవన్ కళ్యాణ్ హర హర వీరమల్లు పనిలో బిజీగా ఉన్నారు. అదేవిధంగా వైష్ణవ్ కూడా తన తదుపరి చిత్రాలతో బిజీగా ఉండటం వల్ల ఈ సినిమా ఊసే ఎత్తడం లేదు. మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ విజయం అందుకున్న ఈ హీరో రెండో సినిమా విషయంలో తిప్పలు తప్పడం లేదు. ప్రస్తుతం కరోనా వ్యాప్తి అధికంగా ఉన్న నేపథ్యంలో ఈ సినిమా థియేటర్ లో కాకుండా ఓటీటీలో విడుదల చేయాలనే ఆలోచనలు దర్శక నిర్మాతలు ఉన్నట్టు తెలుస్తోంది. ఏది ఏమైనా మొదటి సినిమా బ్లాక్ బస్టర్ కొట్టిన మెగా హీరోకి రెండవ సినిమా తీవ్ర నిరాశను కల్పించిందని చెప్పవచ్చు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…