సింగర్ సునీత గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. తన గాత్రంతో ఎన్నో అద్భుతమైన పాటలు పాడి ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్న సింగర్ సునీత ప్రస్తుతం ఎంతో బిజీగా ఉన్నారు. రెండో వివాహం చేసుకున్న తర్వాత సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే సునీత ప్రస్తుతం బుల్లితెరపై ప్రసారమయ్యే డ్రామా జూనియర్స్ కార్యక్రమానికి న్యాయనిర్ణేతగా వ్యవహరిస్తున్నారు.
ఈ కార్యక్రమంలో చిన్నారులు చేసే స్కిట్ లకు సంతోషపడుతూ, కొన్ని భావోద్వేగమైన సంఘటనలకు సునీత కంటతడి పెట్టిన సందర్భాలు ఉన్నాయి. ఈ క్రమంలోనే ఓ చిన్నారి నాగార్జున నటించిన మన్మధుడుస్ఫూప్‌తో స్కిట్ చేస్తూ అందరినీ ఎంతగానో నవ్వించారు. ఈ స్కిట్ లో భాగంగా పెళ్ళంటే చిరాకు పడే అభి పాత్రలో ఎంతో అద్భుతంగా నటించారు.
ఈ స్కిట్ అనంతరం సింగర్ సునీత మాట్లాడుతూ.. ఆ బుడ్డోడికి ఓ ప్రశ్న అడిగారు.. నీకు గర్ల్ ఫ్రెండ్ ఉంటే ఎలా ఉండాలో చెప్పు?అని అడగగా అందుకు బుడ్డోడు ఒక్క క్షణం ఆలోచించకుండా నీలా ఉండాలి అంటూ సమాధానం చెప్పాడు. బుడ్డోడి మాటలకు ఒక్కసారిగా సునీత షాకయ్యారు. ప్రస్తుతం ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో వైరల్ గా మారింది.