హీరో సిద్ధార్థ్ ఈ మధ్య సినిమాలలో తక్కువగా కనిపిస్తున్నప్పటికీ సోషల్ మీడియాలో ఫుల్ జోష్ లో ఉంటాడు. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటూ బిజెపి అధికారులపై, నరేంద్ర మోడీ పై విమర్శలు చేస్తూ ట్వీట్ చేస్తూ ఉంటారు. సిద్ధార్థ ఈ విధంగా చేసే ట్వీట్లు కొన్నిసార్లు వివాదాలకు దారి తీస్తుంటాయి. ఈ క్రమంలోనే ఓ బిజెపి నాయకురాలు సిద్ధార్థ్ ఫోన్ నెంబర్ ను సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశారు.
ఈ నేపథ్యంలోనే సిద్ధార్థ్ ఫోన్ కు కొన్ని వందల ఫోన్ కాల్స్ రావడమే కాకుండా అతనిని, తన కుటుంబాన్ని చంపేస్తామంటూ బెదిరింపులు కూడా వచ్చాయి. అయితే సిద్ధార్థ ఆ ఫోన్ కాల్స్ అన్నింటిని రికార్డు చేశానని ఏ ఒక్కరిని వదిలిపెట్టను అంటూ.. వారిపై పోలీసులకు ఫిర్యాదు చేయబోతున్నా అంటూ తెలియజేశారు. హీరో సిద్ధార్థ్ కి ఈ విధంగా బెదిరింపు కాల్స్ రావడంతో తమిళనాడు పోలీసులు అతనికి రక్షణ కల్పించేందుకు రంగంలోకి దిగారు.
తన కుటుంబంలో ఇలాంటి సంఘటనలు జరగడం ఇదే మొదటిసారి కావడంతో ఈ విషయం పట్ల తన తల్లి ఎంతగానో భయపడినట్లు సిద్ధార్థ తెలిపారు. అయితే పోలీసుల నుంచి సామాన్య ప్రజల నుంచి తనకు మద్దతుగా ఉంటామంటూ మెసేజ్లు రావడంతో అవన్నీ తన తల్లికి చూయించి ధైర్యం చెప్పినట్లు తెలుస్తోంది. అయితే తన రక్షణ కోసం కేటాయించిన అధికారులను ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో ఇతర విధులకు నిర్వహించుకోవాలని,తనకు రక్షణగా నియమించినందుకు పోలీస్ అధికారులకు సిద్ధార్థ్ ధన్యవాదాలు తెలిపారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…