ప్రస్తుతం ఉన్న ఈ పరిస్థితులలో ప్రతిరోజు లక్షల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి.ఈ క్రమంలోనే గత కొన్ని నెలల నుంచి ఎటువంటి ముహూర్తాలు లేకపోవడంతో వచ్చే నెలలో కొన్ని లక్షల సంఖ్యలో వివాహాలు జరుగుతున్నాయి.ఈ విధంగా రోజు కేసులు పెరుగుతున్న క్రమంలో కొందరు పెళ్లిళ్లను వాయిదా వేసుకోక మరి కొందరు కేవలం కొంతమంది సమక్షంలోనే పెళ్లి జరుపుకుంటున్నారు. ఈ క్రమంలోనే మై విలేజ్ షో అనిల్ తన పెళ్లి కొత్త పద్ధతిని ఎంచుకున్నాడు.
అనిల్ పెళ్లికి వేయించిన శుభలేఖలోనే అన్నింటిని వివరించాడు. పెళ్లి ఏ విధంగా జరుగుతుంది, ప్రజలు ఏ విధంగా ఉండాలి, కట్నకానుకలు ఎలా వేయాలి అనే విషయాలన్నింటిని పెళ్లి పత్రికలోనే రూపొందించాడు. సాధారణంగా పెళ్లి పత్రికలు శ్రీరస్తు.. శుభమస్తు అని మొదలవగా అనిల్ పెళ్లి పత్రిక మాత్రం శానిటైజర్ ఫస్టు.. మాస్క్ మస్టు.. సోషల్ డిస్టెన్స్ బెస్ట్ అంటూ కరోనా నిబంధనలను తెలియజేశాడు.
ఇక పెళ్లి కూతురు, పెళ్లి కొడుకు పేరు కింద చదువు క్వాలిఫికేషన్ లో కరోనా నెగిటివ్ అని రాయించారు. పెళ్లి ని ఆన్లైన్ లో చూసే విధంగా,కట్నకానుకలు కూడా డిజిటల్ పద్ధతిలో చెల్లించే విధంగా పెళ్లి పత్రిక పై బార్ కోడ్ కూడా ప్రింట్ చేశారు. తన పెళ్ళికి వచ్చే కట్నకానుకలు కరోనా బాధితుల కోసం ఉపయోగిస్తామని పెళ్లి పత్రికలు వివరించాడు. ఈ విధంగా అనిల్ తన పెళ్లి విభిన్న పద్ధతిలో చేసుకోవడంతో ఈ పెళ్లి పత్రిక కాస్త ప్రస్తుతం వైరల్ గా మారింది. ప్రస్తుతం ఉన్న పరిస్థితులకు అద్దం పట్టే విధంగా ‘కరోనా కాలంలో లగ్గం పత్రిక’ అని పెళ్లి పత్రికపై రాసి నవ్వించే ప్రయత్నం చేసిన అందులో నిజం ఉందంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…