పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కొంతకాలం విరామం తర్వాత వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. ఈ క్రమంలోనే సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్స్ పై సూర్యదేవర నాగ వంశీ నిర్మాణంలో సాగర్ కే చంద్ర దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా మల్టీస్టారర్ చిత్రంగా “భీమ్లా నాయక్” తెరకెక్కుతున్న సంగతి మనకు తెలిసిందే. ఈ సినిమాలో పవన్ కల్యాణ్ భీమ్లా నాయక్ అనే పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపిస్తున్నారు.
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమా నుంచి టైటిల్ సాంగ్ ను విడుదల చేయనున్నట్లు ప్రకటించిన చిత్ర బృందం ప్రస్తుతం సినిమా నుంచి టైటిల్ సాంగ్ ను విడుదల చేసింది. ఈ పాట సోషల్ మీడియాలో దుమ్ము లేపుతోంది. ఎస్.ఎస్ తమన్ అందించిన స్వరాలు ఈ పాటకు ఎంతో హైలెట్ గా నిలిచాయి.
రామజోగయ్య శాస్త్రి అందించిన సాహిత్యానికి ఎస్.ఎస్.తమన్ సంగీతం తోడవగా ఈ పాట ఎంతో హైలెట్ గా నిలిచింది. తాజాగా ఈ సినిమా నుంచి విడుదలైన టైటిల్ సాంగ్.. ఆడాగాడు.. ఈడాగాడు.. అమీరోళ్ల మేడాగాడు గుర్రంనీల్ల గుట్టకాడ.. బెమ్మాజెముడు చెట్టున్నాది.. శభాష్ భీమ్ల నాయక్ అంటూ వచ్చే ఈ పాట సోషల్ మీడియాలో వైరల్ గా మారి ఎంతో మంది నెటిజన్లను ఆకట్టుకుంటోంది. పవన్ కల్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా చిత్ర బృందం ఇచ్చిన స్పెషల్ ట్రీట్ తో పవన్ అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. అలాగే పుట్టిన రోజు జరుపుకుంటున్న “భీమ్లా నాయక్” కి పెద్ద ఎత్తున అభిమానులు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.