మన ఇండియాలో సినిమాలకు ఎంత క్రేజ్ ఉందో క్రికెట్ కి అంతకన్నా మరింత ఎక్కువ క్రేజ్ ఉందని చెప్పవచ్చు. ఈ క్రమంలోనే మన క్రికెటర్లు అందరు సినీ ఇండస్ట్రీలోని హీరోయిన్లతో ప్రేమలో పడుతుంటారు.మహమ్మద్ అజారుద్దీన్ నుంచి నేటీ తరం యువ క్రికెటర్స్ వరకు పలువురు హీరోయిన్ల తో డేటింగ్ చేశారు.ఈ క్రమంలోనే కొందరు పెళ్లి పీటల వరకు వెళ్లి పెళ్లి చేసుకుని జీవితంలో స్థిర పడగా మర బ్రేకప్ చెప్పుకొని అంతటితోనే వారి ప్రేమ వ్యవహారానికి పులిస్టాప్ పెట్టారు. ఈ రెండో కోవకు చెందిన వారే గంగోలి సినీ నటి నగ్మా.
మాజీ క్రికెటర్ సౌరవ్ గంగూలీ హీరోయిన్ నగ్మాతో ప్రేమలో పడిన సంగతి మనకు తెలిసిందే. అప్పట్లో వీరి ప్రేమ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. ఇద్దరూ కలిసి సీక్రెట్ గా పార్టీలకు హోటళ్లకు వెళుతూ కెమెరాల చేతికి దొరికిన హాట్ టాపిక్ గా నిలిచారు. అయితే అప్పటికి గంగూలీ డోనాను ప్రేమ వివాహం చేసుకున్నాడు. ఈ క్రమంలోనే 90లలో నటి నగ్మా రేంజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్, మలయాళం, కన్నడతో పాటు భోజ్‌పూరి, బెంగాలీ, పంజాబీ, మరాఠ వంటి భాషల్లో పలు సినిమాలలో నటించి ఎంతో క్రేజ్ సంపాదించుకున్నారు.
1999 వరల్డ్ కప్ మ్యాచ్ ప్రాంతంలో జరిగినప్పుడు వీరిద్దరూ లండన్ లో చెట్టాపట్టాలేసుకుని లండన్ వీధులలో తిరిగారు. అదేవిధంగా ఓసారి శ్రీకాళహస్తిలో ఇద్దరు కలిసి ప్రత్యేక పూజలు పాల్గొనడం ఇవన్నీ అప్పట్లో హాట్ టాపిక్ గా మారాయి. అయితే ఉన్నఫలంగా వీరిద్దరూ విడిపోయినట్లు వార్తలు కూడా వినిపించాయి.ఈ క్రమంలోనే నగ్మా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ వీరిద్దరూ ప్రేమలో ఉన్న మాట వాస్తవమేనని అయితే అప్పట్లో కెరీర్ పరంగా ఎంతో పీక్ స్టేజ్ లో ఉన్న నేను, గంగూలీ మా ఇద్దరికీ ఈగో అడ్డు రావడం వల్లనే మేమిద్దరం విడిపోయామని తెలియజేశారు. కానీ దాదా మాత్రం తన ప్రవర్తన నచ్చకపోవడం వల్లే వీరిద్దరు విడిపోయారు అని వార్తలు అప్పట్లో షికార్లు చేశాయి.