సెలబ్రిటీలకే కాదు, ఎవరికైనా సరే కార్లపై వ్యామోహం ఉంటుంది. లగ్జరీ కార్లను కొని వాడేందుకు వారు ఆసక్తిని చూపిస్తుంటారు. అందులో భాగంగానే పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కూడా ఓ కొత్త కార్ కొన్నాడు. లంబోర్గిని అవెంటడార్ మోడల్ కారును ప్రభాస్ కొనుగోలు చేశాడు. దాని ఖరీదు అక్షరాలా రూ.6 కోట్లు అని తెలుస్తోంది. ప్రభాస్ కొన్న ఆ కారుకు చెందిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ప్రభాస్ కొత్త కారు ఫొటోలను చూసిన అతని అభిమానులు పట్టరానంత ఆనందం వ్యక్తం చేస్తున్నారు. రాజుకు కొత్త రథం వచ్చిందని, ప్రభాస్ కారు కొన్నందుకు ఆయనకు శుభాకాంక్షలు అని.. రక రకాలుగా ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు.
కాగా ప్రభాస్ ప్రస్తుతం పలు వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. పూజా హెగ్డెతో అతను కలిసి నటించిన రాధే శ్యామ్ ఈ ఏడాది జూలై 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. రొమాంటిక్ మూవీగా రాధే శ్యామ్‌ను తెరకెక్కిస్తున్నారు. ఇక నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ మరో మూవీ చేయనున్నాడు. అందులో అమితాబ్ బచ్చన్, దీపికా పదుకునేలు నటించనున్నారు. ఇక ఓమ్ రౌత్ దర్శకత్వంలో ఆది పురుష్ అనే మూవీ కూడా నిర్మాణమవుతోంది. అందులో సైఫ్ అలీ ఖాన్ రావణుడిగా నటిస్తుండగా, కృతి సనన్, సన్నీ సింగ్‌లు సీత, లక్ష్మణుడి పాత్రలను పోషిస్తున్నారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…