ప్రైవేటు బ్యాంకింగ్ సంస్థ కోటక్ మహీంద్రా ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను మార్చింది. ఈ క్రమంలో మార్చిన ప్రకారం వడ్డీ రేట్లను అందివ్వనుంది. 7 నుంచి 30 రోజుల వ్యవధి కలిగిన ఫిక్స్‌డ్ డిపాజిట్లకు, 31 నుంచి 90 రోజులు, 91 నుంచి 179 రోజుల వ్యవధి కలిగిన ఎఫ్‌డీలకు బ్యాంకు వరుసగా 2.5, 2.75, 3.25 శాతం వడ్డీ రేట్లను చెల్లించనుంది. అలాగే 180 రోజుల నుంచి 1 ఏడాది వ్యవధి గల టర్మ్ డిపాజిట్లపై 4.40 శాతం వడ్డీ రేటును అందిస్తోంది. అలాగే 1 ఏడాది నుంచి 389 రోజుల వ్యవధి వరకు అయితే 4.50 శాతం వడ్డీని చెల్లిస్తుంది.
390 రోజుల నుంచి 23 నెలల కాలానికి ఎఫ్‌డీలకు 4.90 శాతం, 23 నెలల నుంచి 3 ఏళ్ల కాలానికి 5 శాతం వడ్డీని బ్యాంక్ చెల్లిస్తుంది. 3 ఏళ్లు ఆపైన, 4 ఏళ్ల లోపు కాలానికి ఎఫ్‌డీలకు 5.10 శాతం, 4 ఏళ్ల నుంచి 5 ఏళ్ల లోపు ఎఫ్‌డీలు అయితే 5.25 శాతం వడ్డీని అందిస్తోంది. 5 ఏళ్ల పైన 10 ఏళ్ల లోపు అయితే 5.30 శాతం వడ్డీ వస్తుంది. సవరించిన ఫిక్స్‌డ్ డిపాజిట్ల వడ్డీ రేట్లను కోటక్ మహీంద్రా బ్యాంక్ మార్చి 25, 2021వ తేదీ నుంచి అమలు చేస్తోంది.
కోటక్ మహీంద్రా బ్యాంకు అందిస్తున్న సవరించిన ఫిక్స్‌డ్ డిపాజిట్ల వడ్డీ రేట్ల వివరాలు ఇలా ఉన్నాయి.
ఇక సీనియర్ సిటిజెన్స్‌కు సాధారణ ప్రజలకు అందించే వడ్డీ రేట్ల కన్నా 50 బేసిస్ పాయింట్ల వడ్డీ రేట్లు ఎక్కువగా లభిస్తాయి. వారు కనీసం 7 రోజుల నుంచి గరిష్టంగా 10 ఏళ్ల వరకు ఫిక్స్‌డ్ డిపాజిట్లను వేయవచ్చు. 3 నుంచి 5.8 శాతం వరకు వడ్డీ చెల్లిస్తారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…