పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ప్రస్తుతం వరుస సినిమాలతో ఎంత బిజీగా ఉన్నారు. ఈ క్రమంలోనే పవన్ కల్యాణ్ మలయాళంలో ఎంతో విజయవంతమైన “అయ్యప్పనమ్ కోషీయమ్” సినిమాను తెలుగులో రీమేక్ చేస్తున్న సంగతి మనకు తెలిసిందే. “భీమ్లా నాయక్” అనే టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో పవన్ కల్యాణ్ ఒక పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపిస్తున్నారు. పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా నుంచి టైటిల్ సాంగ్ విడుదల చేయగా ఈ పాట సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
పవన్ కల్యాణ్ పుట్టినరోజు జరుపుకుంటున్న నేపథ్యంలో ఆయన సినిమాకు సంబంధించిన వరుస అప్‌డేట్ లను విడుదల చేస్తూ పవన్ అభిమానులకు మంచి ట్రీట్ ఇవ్వడంతో పవన్ అభిమానులు ఫుల్ ఖుషీగా ఉన్నారు. ఈ క్రమంలోనే పవన్ కల్యాణ్ క్రిష్ దర్శకత్వంలో నటిస్తున్న హరి హర వీరమల్లు చిత్రం విడుదల తేదీని కూడా పవన్ పుట్టినరోజు సందర్భంగా అధికారికంగా ప్రకటించారు.
ఇకపోతే పవన్ కల్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో పవన్ హీరోగా వస్తున్న తన 29వ చిత్రానికి సంబంధించిన అప్‌డేట్ ను చిత్రబృందం విడుదల చేసింది. ఈ క్రమంలోనే ఈ సినిమాకు సంబంధించి యథా కాలమ్.. తథా వ్యవహారమ్ అంటూ ఓ పోస్టర్‌ను వదలడంతో ఈ పోస్టర్ వైరల్ గా మారింది. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు వక్కంతం వంశీ కథను అందించగా రామ్ తాళ్లూరి నిర్మిస్తున్నారు. సురేందర్ రెడ్డి, వక్కంతం కాంబినేషన్ లో ఇప్పటివరకు కిక్, రేసుగుర్రం వంటి బ్లాక్ బస్టర్ చిత్రాలు వచ్చాయి. ఆ తర్వాత పవన్ హీరోగా వస్తున్న ఈ సినిమాపై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…