దేశవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తుంది. మొదటిసారి కన్నా ఇప్పుడు పరిస్థితులు ఎంతో గందరగోళంగా ఉన్నాయి. ఈ వైరస్ తీవ్రత అధికమవుతుందని ఎంతో సాధారణ ప్రజల నుంచి సెలబ్రిటీల వరకు ప్రతి ఒక్కరు ఈ మహమ్మారి బారిన పడుతున్నారు. ఇప్పటి వరకు ఎంతో మంది సినిమా సెలబ్రిటీలు కరోనా మహమ్మారి బారిన పడ్డారు.
ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ సినిమా వకీల్ సాబ్ చిత్ర బృందంలోని సభ్యులతో పాటు పవన్ కళ్యాణ్ భద్రతా సిబ్బందికి కూడా కరోనా పాజిటివ్ రావడంతో పవన్ కళ్యాణ్ హోమ్ క్వారంటైన్ కి వెళ్లారు.ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ ఆస్పత్రిలో కరోనా పరీక్షలు చేయించుకోవడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
గత రాత్రి పవన్ కళ్యాణ్ ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో కరోనా పరీక్షలు చేయించుకున్నట్లు, దానికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అయితే పవన్ కళ్యాణ్ కరోనా నిర్ధారణ పరీక్షలలో పాజిటివ్ అని వచ్చిందా లేక నెగిటివ్ అన్న విషయం గురించి ఆస్పత్రి వర్గాలు గాని ఇటు జనసేన పార్టీ వారు కానీ అధికారికంగా ప్రకటించలేదు. పైగా సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ కు పాజిటివ్ అంటూ వార్తలు రావడంతో పవన్ అభిమానులు ఆందోళన చెందుతున్నారు.