అక్కినేని నాగార్జున ప్రస్తుతం వరుస సినిమాలతో ఎంత బిజీగా ఉన్నారు. కేవలం సినిమాలు మాత్రమే కాకుండా బుల్లితెరపై బిగ్ బాస్ కార్యక్రమానికి కూడా వ్యాఖ్యాతగా వ్యవహరించారు. ఇకపోతే ప్రస్తుతం నాగార్జున ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఓ సినిమాలో నటిస్తున్న సంగతి మనకు తెలిసిందే. తాజాగా నేడు నాగార్జున పుట్టిన రోజు కావడంతో ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు.
ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో “రా” ఏజెంట్‌గా నాగార్జున కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ క్రమంలోనే నేడు నాగార్జున పుట్టిన రోజు కావడంతో ఈ సినిమాకు “ది ఘోస్ట్” అనే టైటిల్ ను ఖరారు చేస్తూ ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అది ఈ సినిమాపై ఆసక్తిని రేకెత్తిస్తోంది. తాజాగా విడుదల చేసిన ఈ పోస్టర్‌లో నాగార్జున వర్షంలో కత్తి పట్టుకుని నిలబడగా ముందు శత్రువులు ఉండడం చూస్తుంటే ప్రవీణ్ సత్తారు నాగార్జునతో సాలిడ్ యాక్షన్ సినిమాను తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది.
Here’s the Stri- 𝐊𝐈𝐍𝐆
Title & Stunning First Look of@iamnagarjuna’s #TheGHOST
#GhostFirstLook
#HBDKingNagarjuna @PraveenSattaru @MsKajalAggarwal #NarayanDasNarang #RamMohanRao @AsianSuniel @sharrath_marar @SVCLLP @nseplofficial pic.twitter.com/tqxfUiNrOO
— BA Raju's Team (@baraju_SuperHit) August 29, 2021
ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక ఈ సినిమా టైటిల్ విషయానికి వస్తే ఇందులో నాగార్జున ఒక ఘోస్ట్ గా మరి శత్రువులను అంతమొందిస్తారని తెలుస్తుంది. ఇకపోతే నేడు నాగార్జుననాగార్జున పుట్టిన రోజు కావడంతో సినిమా సెలబ్రిటీలు, అక్కినేని అభిమానులు పెద్ద ఎత్తున నాగార్జునకి సోషల్ మీడియా వేదికగా పుట్టినరోజు శుభాకాంక్షలను తెలియజేస్తున్నారు.