రానా హీరోగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన “లీడర్” సినిమా ద్వారా వెండితెర అరంగేట్రం చేసిన నటి రిచా గంగోపాధ్యాయ ఆ తర్వాత నాగవల్లి, మిరపకాయ్, మిర్చి వంటి పలు సినిమాల్లో నటించి మంచి గుర్తింపును సంపాదించుకున్నారు. ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత ఎక్కువ కాలం పాటు ఇండస్ట్రీలో నిలువ లేకపోయిన ఈ ముద్దుగుమ్మ తన చిన్ననాటి స్నేహితుడు జో లాంగేల్లాను ఎవరికీ తెలియకుండా పెళ్లి చేసుకున్నారు.
పెళ్లి చేసుకున్న కొద్ది రోజుల తర్వాత తన పెళ్లి విషయాన్ని బయటపెట్టిన ఈ హీరోయిన్ తరువాత తన తల్లి కాబోతుందనే విషయాన్ని కూడా ఎంతో ఆలస్యంగా అభిమానులతో పంచుకున్నారు. కొద్దిరోజుల క్రితమే తాను గర్భవతి అని తన బేబీ బంప్ లుక్ పోస్ట్ చేస్తూ అసలు విషయం బయటపెట్టింది. అప్పట్లో ఈ ఫోటో బాగా వైరల్ గా మారింది.
తాజాగా ఈ మిర్చి బ్యూటీ మే 27వ తేదీన తను ఒక పండంటి మగబిడ్డకు జన్మనిచ్చినట్లు తాజాగా ఇంస్టాగ్రామ్ వేదికగా తెలిపారు. మే 27న తన బిడ్డ జన్మించగా ఈ విషయం కాస్త ఆలస్యంగా అభిమానులకు తెలియజేస్తున్నట్లు ఈమె పేర్కొంటూ తమ బిడ్డకు సంబంధించిన ఫోటోను ఇన్స్టాగ్రామ్ వేదికగా అభిమానులతో పంచుకున్నారు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.