మెగాస్టార్ చిరంజీవి సినిమా అప్‌డేట్ వస్తుందంటే చాలు, అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. ఆయన సినిమాలకు చెందిన ఏ చిన్న అప్ డేట్ వచ్చినా అభిమానులు ఎంతో సంబరపడిపోతారు. అయితే తాజాగా ఆయన పుట్టిన రోజు, రాఖీ పండుగ ఒకే రోజు రావడంతో ఆయన లేటెస్ట్ చిత్రానికి చెందిన అప్‌డేట్‌ను చిత్ర యూనిట్ ప్రకటించింది.
మెహర్ రమేష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భోళా శంకర్ మూవీకి చెందిన అప్‌డేట్‌ను చిత్రయూనిట్ ప్రకటించింది. ఈ మూవీకి చెందిన టైటిల్ వీడియోను ఇటీవలే మహేష్ బాబు విడుదల చేశారు. దీనికి భారీ ఎత్తున స్పందన వచ్చింది. ఈ క్రమంలోనే ఆ వీడియో ట్విట్టర్‌లో 10 లక్షల వ్యూస్‌ను సాధించింది.
https://www.youtube.com/watch?v=QEHLw0seweU
ఇక భోళా శంకర్ మూవీకి చెందిన ఇంకో వీడియోను కూడా రిలీజ్ చేశారు. రాఖీ పండుగ రోజు, మెగాస్టార్ పుట్టిన రోజు సందర్భంగా ఆయనకు కీర్తి సురేష్ రాఖీ కడుతున్న సినిమా వీడియోను విడుదల చేశారు. దీంతో ఆ వీడియోను కూడా అభిమానులు పెద్ద ఎత్తున ఆదరిస్తున్నారు. దీంతో ఆ వీడియోకు ఇప్పటికే 53 లక్షలకు పైగా వ్యూస్, 2.35 లక్షల లైక్స్ వచ్చాయి. ఆ వీడియో టాప్ ట్రెండింగ్‌లో ఒకటిగా మారింది.
తమిళంలో సూపర్‌హిట్ సాధించిన వేదాళం సినిమాకు రీమేక్‌గా భోళా శంకర్‌ను నిర్మిస్తున్నారు. ఇందులో మెగాస్టార్ సోదరిగా కీర్తి సురేష్ నటిస్తోంది. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై అనిల్ సుంకర ఈ మూవీని నిర్మిస్తున్నారు.