మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు జరుపుకుంటున్న సందర్భంగా పెద్ద ఎత్తున అభిమానులు, ఇతర సెలబ్రిటీల నుంచి పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలోనే చిరంజీవి నటిస్తున్న సినిమాకు సంబంధించిన సమాచారం వెలువడుతుందని అభిమానులు కొన్ని రోజుల నుంచి ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఈ సమయంలోనే మెగాస్టార్ చిరంజీవి తన 154వ చిత్రంగా చేస్తున్న చిత్రానికి సంబంధించిన టైటిల్ ను చిత్రబృందం విడుదల చేసింది.
ప్రస్తుతం మెగాస్టార్ 153వ చిత్రంగా కొరటాలశివ దర్శకత్వంలో “ఆచార్య” సినిమాలో నటిస్తున్నారు. ఈ క్రమంలోనే మెహర్ రమేష్ దర్శకత్వంలో మెగాస్టార్ 154 చిత్రంగా “వేదాళం” సినిమాను రీమేక్ చేస్తున్న సంగతి మనకు తెలిసిందే. తమిళంలో అజిత్ నటించిన ఈ సినిమా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఈ క్రమంలోనే ఈ సినిమాను తెలుగులో రీమేక్ చేయనున్నారు.
తెలుగులో మెగాస్టార్ హీరోగా తెరకెక్కుతున్నటువంటి “వేదాళం” చిత్రానికి “భోళాశంకర్” అనే టైటిల్ ను ఖరారు చేసినట్లు చిత్ర బృందం తెలియజేసింది. ఈ క్రమంలోనే ఈ సినిమా టైటిల్ మోషన్ పోస్టర్ ను సూపర్ స్టార్ మహేష్ బాబు విడుదల చేశారు. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై అనిల్ సుంకర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో మెగాస్టార్ చిరంజీవి చెల్లెలు పాత్రలో కీర్తి సురేష్ నటిస్తోంది.
https://twitter.com/urstrulyMahesh/status/1429284693959057417