ఒకప్పుడు కుటుంబ కథ నేపథ్యంతో తెరకెక్కిన సినిమాలలో నటించి ఎంతో మంది ప్రేక్షక అభిమానులను సంపాదించుకున్న నటుడు జగపతి బాబు కొంతకాలం విరామం తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ బాలకృష్ణ బోయపాటి కాంబినేషన్లో తెరకెక్కిన లెజెండ్ సినిమాలో విలన్ పాత్ర ద్వారా ఎంట్రీ ఇచ్చారు. అయితే ప్రస్తుతం సినిమా షూటింగ్ లు వాయిదా పడటంతో ఇంటికే పరిమితమైన సెలబ్రిటీలు వివిధ రకాల పనులపై దృష్టి సారించారు.
ఈ క్రమంలోనే నటుడు జగపతిబాబు సుమారు ఏడు సంవత్సరాల తర్వాత ఏం చేయాలో తెలియక తన గడ్డం గీసుకున్నట్లు తెలిపారు.ఈ క్రమంలోనే క్లీన్ షేవ్ తో ఉన్న ఫోటోని షేర్ చేస్తూ లాక్ డౌన్ కారణంగా చేసే పని లేక ఈ విధంగా షేవ్ చేసుకున్నానని తెలిపారు. దాదాపు ఏడు సంవత్సరాల క్రితం లెజెండ్ సినిమాలో గుబురు గడ్డం, పెప్పర్ సాల్ల్ లుక్కులో జగపతి దర్శనమిచ్చి షాకిచ్చారు. అప్పటి నుంచి జగపతి బాబు దాదాపు అదే స్టైల్ లో కనిపించారు.
లెజెండ్ సినిమా తర్వాత ఎన్నో చిత్రాలలో విలన్ పాత్రలో, సపోర్టింగ్ క్యారెక్టర్, ఫాదర్ క్యారెక్టర్లో కనిపించిన జగపతిబాబు గడ్డంతోనే కనిపించారు. ప్రస్తుతం చేయడానికి ఏం పని లేకపోవడంతో ఈ విధంగా సేవింగ్ చేసుకున్నట్లు తెలిపారు. ఈ విధంగా నా గడ్డం చూస్తే నాకు పని లేదని తెలిసి పోతుంది అంటూ తనపై తానే సెటైర్లు వేసుకున్నారు.ఈ మధ్యే రజినీకాంత్ అన్నాత్తె సినిమా కోసం అదిరిపోయే లుక్కును ట్రై చేసినట్టు ఈ సందర్భంగా జగపతి బాబు పేర్కొన్నారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…