తనకు ఆరోగ్యం బాగా లేదని తన యజమానికి చెప్పడమే తన పాలిట తన కుటుంబం పాలిట శాపంగా మారింది. తన యజమాని చెప్పిన పని నిరాకరించినందుకే కోపంతో యజమాని తన భార్య పిల్లలను కిడ్నాప్ చేసి భార్య పట్ల ఎంతో అమానుషంగా ప్రవర్తించిన ఘటన మధ్యప్రదేశ్‌లో ఛతర్పూర్ జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు..
ఛతర్పూర్ జిల్లాలో ఓ గ్రామంలోని భూస్వామి తన పొలంలో ఉన్న చెట్లను నరికి వేయడానికి దళిత కార్మికుడిని నియమించుకున్నాడు. అయితే అతనికి ఆరోగ్యం బాగా లేకపోవడంతో ఆ పని చేయడానికి నిరాకరించాడు. పని ఒప్పుకొని చేయకపోవడంతో ఎంతో ఆగ్రహం వ్యక్తం చేసిన యజమాని ఆ దళితుడిపై వాగ్వాదానికి దిగాడు.ఈ క్రమంలోనే అతడు అక్కడి నుంచి ఇంటికి వెళ్లిపోగా అతని పై కోపం పెంచుకున్న యజమాని అతని ఇంటికి వెళ్లి తన భార్య పిల్లలు అతని తల్లిని కిడ్నాప్ చేయించాడు.
ఆ దళితుని భార్య గర్భవతి అని తెలిసినా కూడా ఏమాత్రం మానవత్వం లేకుండా ఆమెను కొట్టారు. నాలుగురోజుల పాటు వారిని బంధించిన యజమాని వారిని చిత్రహింసలకు గురిచేశారు.విషయం తెలిసిన జర్నలిస్ట్ పోలీసులకు సమాచారం ఇవ్వగా పోలీసుల సహాయంతో వారి ఆచూకీని తెలుసుకుని గాయపడిన వారిని సరైన చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన పై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రధాన నిందితుడి అరెస్టు చేసి అతనికి సహకరించిన మరో ఇద్దరి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
తాజాగా ఈ ఘటనపై బాధితురాలు సంచలన వ్యాఖ్యలు చేసింది.సదరు యజమాని తన కొట్టడమే కాకుండా పిల్లల ఎదురుగానే తనపై లైంగికంగా దాడి చేశారని, ఆ విషయాన్ని పోలీసులు ఎఫ్ఐఆర్ లో నమోదు చేయలేదు అంటూ ఆరోపించింది. ఈ విషయంపై స్పందించిన పోలీసులు ఆమె కేవలం తనపై దాడి చేశారని, లైంగికంగా దాడి జరిగినట్లు తను పేర్కొనలేదని.. ఒకవేళ ఆమెపై లైంగికదాడి జరిగినట్టు చెబితే తప్పకుండా ఎఫ్ఐఆర్ లో నమోదు చేస్తామని ఛతర్పూర్ జిల్లా ఎస్పీ సచిన్ శర్మ తెలిపారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…