దక్షిణాదిలోనే కాదు.. బాలీవుడ్‌లోనూ పలు చిత్రాల్లో నటించిన ఇలియానా చాలా ఏళ్ల నుంచి సినీ ఇండస్ట్రీకి దూరమైంది. గతంలో రవితేజ సరసన అమర్ అక్బర్ ఆంథోని చిత్రంలో కనిపించి అలరించింది. తరువాత సినిమాల్లో ఆమె కనిపించడం లేదు. అడపా దడపా ఈవెంట్లలో కనిపించి సందడి చేస్తోంది. అయితే తాజాగా ఇలియానా పోస్ట్ చేసిన పిక్‌ను చూస్తే అసలు ఆమె ఇలియానా నేనా అనిపిస్తోంది. అంతలా ఆమ మారిపోయింది.
బీచ్‌లో టైమ్ స్పెండ్ చేసిన అనంతరం ఇలియానా తనకు చెందిన ఓ ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో ఆ ఫొటోను ఉంచింది. అయితే ఆ ఫొటోలో ఆమె గుర్తు పట్టలేనతంగా మారిపోయి కనిపించింది. దీంతో అసలు ఆమె ఇలియానా నేనా అని నెటిజన్లు సందేహం వ్యక్తం చేస్తున్నారు.
ఒకప్పుడు ఇలియానా ఎంతో గ్లామరస్‌గా ఉండేది. అయితే ఆమె తాజా లుక్ చూసి షాకవుతున్నారు. ఇక ఇలియానా ఇటీవలే అభిషేక్ బచ్చన్ సరసన ది బిగ్ బుల్ అనే డిజిటల్ మూవీలో నటించింది. కానీ అంతగా ఆదరణ లభించలేదు. ఇక త్వరలో ఆమె అన్‌ఫెయిర్ ఎన్ లవ్లీ అనే మూవీలో నటించనుంది. అందులో రణదీప్ హుడా సరసన ఆమె నటిస్తోంది. ఆ మూవీ హర్యానా బ్యాక్ డ్రాప్‌లో నడుస్తుంది.