సాధారణంగా సినీ సెలబ్రిటీస్ అంటే అందరికీ ఎంతో ఇష్టం ఉంటుంది. ఒక్కసారిగా సెలబ్రిటీలు బయట కనబడితే వారితో సెల్ఫీ తీసుకోకుండా ఉండలేరు.ప్రస్తుత కాలంలో అయితే ఫోన్ లు అందుబాటులో ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు సెల్ఫీ తీసుకునే వారు. కానీ ఇంతకు మునుపు సెలబ్రిటీల ఆటోగ్రాఫ్ కోసం ఎంతోమంది ఎంతో ఆతృతగా ఎదురు చూసేవారు.తాజాగా ఇటువంటి ఘటనకు సంబంధించిన ఓ విషయాన్ని నటుడు రాజీవ్ కనకాల సోషల్ మీడియా ద్వారా తెలియజేస్తూ ఎమోషనల్ అయ్యారు.
తాజాగా రాజీవ్ కనకాల తన అభిమాని గురించి చెప్పిన మాటలు అందరినీ ఎంతగానో ఆకట్టుకున్నాయి. 2018వ సంవత్సరంలో జరిగిన సంఘటనను రాజీవ్ గుర్తుచేసుకుంటూ ఒకసారి ఎయిర్ పోర్ట్‌కు వెళ్తే ఒకతను పరిగెత్తుకుంటూ వచ్చాడని, అతని కళ్లల్లో ఆనందం కనిపించిందని తనకు ఎదురైన ఈ సంఘటనను ఈ సందర్భంగా రాజీవ్ కనకాల వివరిస్తూ పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
2018 వ సంవత్సరంలో ఓ అభిమాని ఎయిర్ పోర్ట్ క్లీనింగ్ డిపార్ట్మెంట్ కి చెందిన ఓ వ్యక్తి తనని చూడగానే అక్కడకు పరిగెత్తుకుంటూ వచ్చాడని తనను పరిచయం చేసుకొని తన గురించి వివరించాడు.అయితే అప్పుడు తనకి నాతో సెల్ఫీ దిగడానికి ఫోన్ అందుబాటులో లేకపోవడంతో తన దగ్గర ఉన్న ఫోన్ లోనే సెల్ఫీ తీసుకున్నానని తెలిపారు. ఈ ఫోటోను తరువాత పోస్ట్ చేద్దామనుకొని మర్చిపోయానని ఇప్పుడు ఈ ఫోటోను పోస్ట్ చేస్తున్నాను.ఆ ఫోటోలో ఉన్న వ్యక్తి ఇప్పటికైనా ఈ ఫోటోను తీసుకోవాలని ఆశిస్తున్నట్లు కనకాల తెలిపారు. ప్రస్తుతం రాజీవ్ కనకాల షేర్ చేసిన ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.