స్టార్ నటిగా గుర్తింపు తెచ్చుకున్న సమంత గురించి ఎవరికీ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తనదైన శైలిలో నటనతో ఆమె అందరినీ ఆకట్టుకుంటుంది. ఆమె నటించిన అనేక సినిమాలు హిట్ అయ్యాయి. దీంతో సక్సెస్‌ఫుల్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకుంది.
ఏ మాయ చేశావే మూవీతో సమంత సినీ తెరపై ప్రవేశం చేయగా ఇప్పటికి నటిగా 10 ఏళ్ల కెరీర్ ముగిసింది. ఇప్పటికీ స్టార్ నటిగా కొనసాగుతోంది. సినిమాలూ, టీవీ షోలు, సిరీస్‌లలో నటిస్తూ అలరిస్తోంది. మరో వైపు వ్యాపారవేత్తగా కూడా సక్సెస్ అయింది.
అయితే తన మూవీలకు చెందిన వివరాలతోపాటు వ్యక్తిగత విషయాలను కూడా ఎప్పటికప్పుడు సమంత తన అభిమానులతో షేర్ చేసుకుంటుంది. అందుకు సోషల్ మీడియాను ఆమె ఎక్కువగా ఉపయోగిస్తుంది. ఈ క్రమంలోనే ఆమెకు ఇన్‌స్టాగ్రామ్‌లో భారీ ఫాలోయింగ్ ఉంది. ఆ ప్లాట్‌ఫామ్‌లో ఆమెకు ఏకంగా 18 మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు.
ఇక ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమె ఒక్క పోస్టు పెడితే రూ.25 లక్షల నుంచి రూ.30 లక్షల వరకు తీసుకుంటుందని తెలిసింది. దీంతోపాటు టీవీ యాడ్స్‌లోనూ నటిస్తూ రూ.లక్షల్లో రెమ్యూనరేషన్ అందుకున్నట్లు సమాచారం. కాగా సమంత ప్రస్తుతం శాకుంతలం అనే సినిమాలో నటిస్తోంది. గుణశేఖర్ ఈ మూవీకి దర్శకత్వం వహిస్తుండగా దిల్ రాజు, నీలిమా గుణ ఈ మూవీని నిర్మిస్తున్నారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…