సోషల్ మీడియాలో సెలబ్రిటీలు ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటారు. తమ అభిమానులతో ఎల్లప్పుడూ టచ్‌లో ఉంటారు. రోజూ తాము ఏం చేస్తున్నదీ, ఏయే కార్యక్రమాల్లో పాల్గొంటున్నదీ, తమ అభిప్రాయాలను, భావాలను.. పంచుకుంటారు. అయితే ఈ మధ్య కాలంలో డబ్ స్మాష్‌లు చేయడం ఎక్కువైపోయింది. అలా నటి, యాంకర్ శ్రీముఖి జబర్దస్త్ ముక్కు అవినాష్‌తో కలిసి ఓ డబ్ స్మాష్ చేసింది.
కార్తీక దీపం సీరియల్ ఎంత ఫేమస్ అయిందో అందరికీ తెలిసిందే. అందులోని ఓ సన్నివేశంతో శ్రీముఖి అవినాష్‌తో కలిసి ఓ డబ్ స్మాష్ చేసింది. దాన్ని ఇన్‌స్టాగ్రామ్ రీల్స్‌లో పోస్ట్ చేసింది. దీంతో ఆ వీడియో వైరల్‌గా మారింది. అందులో అవినాష్ శ్రీముఖిని చెంప దెబ్బ కొడుతున్నట్లు ఉన్న సీన్‌ను చూడవచ్చు.
https://www.instagram.com/reel/CS99C_RnsVv/?utm_source=ig_embed&ig_rid=374784a6-9f84-4c97-940e-0dd083886b6e
కాగా ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో నెటిజన్లను ఆకట్టుకుంటోంది. సీరియల్‌లోగా నటించారంటూ ఆ ఇద్దరికీ నెటిజన్లు కితాబిస్తున్నారు.