టాలీవుడ్ ఇండస్ట్రీలో “చలో” సినిమా ద్వారా వెండితెరకు పరిచయమై వరుస సినిమాలతో దూసుకుపోతూ తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ క్రేజ్ సంపాదించుకున్న రష్మిక మందన్నా ప్రస్తుతం పలు భాషలలో సినిమాలు చేస్తూ ఎంతో బిజీగా ఉన్నారు. వరుస షూటింగ్లతో బిజీగా గడుపుతున్న రష్మిక తాజాగా సోషల్ మీడియా వేదికగా అభిమానులతో సరదాగా ముచ్చటించారు. ఈ క్రమంలోనే అభిమానులు అడిగిన పలు ప్రశ్నలకు సరదాగా సమాధానాలు చెబుతూ అభిమానులను సందడి చేశారు.
తెలుగు ఇండస్ట్రీలో ఎంతో క్రేజ్ ఉన్న హీరోలలో విజయ్ దేవరకొండతో గీత గోవిందం, డియర్ కామ్రేడ్ వంటి చిత్రాలలో నటించారు. ఈ జోడికి ఎంత పాపులర్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అయితే ఓ అభిమాని విజయ్ దేవరకొండతో మరో సినిమా చేస్తారా? అని అడగడంతో అందుకు రష్మిక ఆ ప్రశ్నను విజయ్ ని అడగండి అంటూ సమాధానం చెప్పారు.
ఒకవేళ ఎవరైనా దర్శకులు మంచి కథతో వస్తే తప్పకుండా విజయ్ తో కలిసి నటిస్తానని, చెప్పడంతో మరోసారి ఈ జోడి తెరపై కనిపిస్తుందని చెప్పవచ్చు. ఇకపోతే ప్రస్తుతం రష్మిక సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కుతున్న “పుష్ప” సినిమాలో నటిస్తున్నారు