తెలుగు బిగ్ బాస్ సీజన్ ఫోర్ ద్వారా ఎంతో మంచి గుర్తింపును సంపాదించుకున్న కంటెస్టెంట్ లలో అరియానా గ్లోరి ఒకరు. ఈ బ్యూటీ అందచందాలు, మాట తీరు, తన వ్యవహార శైలి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వివాదాస్పద డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మను ఇంటర్వ్యూ చేసి సోషల్ మీడియాలో ఫుల్ పాపులర్ అయిన ఈ బ్యూటీ పలు అవకాలను దక్కించుకుంది.ఈ క్రమంలోనే బిగ్ బాస్ హౌస్ ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈమె ఆ తర్వాత వరుస అవకాశాలు దక్కించుకున్నారు.
తాజాగా రామ్ గోపాల్ వర్మతో మరొకసారి ఇంటర్వ్యూ చేసి సోషల్ మీడియాలో మరోసారి వైరల్ గా మారింది. అదేవిధంగా ఎప్పటికప్పుడు తన గ్లామరస్ ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ అభిమానుల సందడి చేస్తున్న ఈమె సినిమాలలో కూడా నటిస్తున్నారు. ఈ క్రమంలోనే తాను కూడా మెగా కుటుంబంలో భాగం అవుతున్నానని అసలు విషయాన్ని సెల్ఫీ వీడియో ద్వారా లీక్ చేసింది ఈ బ్యూటీ. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
చిరంజీవి చిన్నల్లుడు కళ్యాణ్ దేవ్ హీరోగా చేస్తున్నటువంటి ఓ సినిమాలో నటించే అవకాశాన్ని దక్కించుకున్న ఈ బ్యూటీ అందులో హీరో చెల్లెలి పాత్రలో నటిస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ వీడియోను సెల్ఫీ వీడియో ద్వారా తెలియజేశారు. ఈ వీడియోలో తనతో పాటు ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న దర్శకుడు శ్రీధర్ కూడా ఉన్నారు.ఈ క్రమంలోనే ఇంత మంచి అవకాశాన్ని ఇచ్చినందుకు డైరెక్టర్ శ్రీధర్ కు ప్రత్యేక ధన్యవాదాలను తెలియజేశారు.