అనసూయ భరద్వాజ్ ఈ పేరుకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. బుల్లితెర యాంకర్ గా ఎన్నో కార్యక్రమాలను చేపడుతూ ఎంతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈమె సినిమాలలో వివిధ పాత్రలలో నటించి మంచి గుర్తింపును సంపాదించుకున్నారు.కెరీర్ పరంగా ఎంతో దూకుడులో ఉన్న అనసూయ సోషల్ మీడియాలో కూడా అంతే యాక్టివ్ గా ఉంటారు. సోషల్ మీడియా వేదికగా ఫోటోలను వీడియోలను షేర్ చేస్తూ అభిమానులను సందడి చేస్తుంటారు.
తాజాగా అనసూయ ప్రధాన పాత్రలో థాంక్యూ బ్రదర్ అనే సినిమాలో నటించిన సంగతి మనకు తెలిసిందే. ఈ సినిమా ఈ నెల 7న ఓటీటీ వేదికగా విడుదల కానుంది.
తెలుగు డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ ఆహాలో మే 7 నుంచి ఈ సినిమా ప్రసారం కానుంది. ఆహా ఈ చిత్రాన్ని ఏకంగా 1.8 కోట్లకు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది.
రమేశ్ రాపర్తి దర్శకుడిగా తెరకెక్కిన ఈ సినిమాలో అనసూయ ఓ గర్భిణి పాత్రలో కనిపిస్తారు.అశ్విన్ విరాజ్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాను జస్ట్ ఆర్డినరీ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై మాగుంట శరత్ చంద్రారెడ్డి, తారక్‌నాథ్ బొమ్మిరెడ్డి సంయుక్తంగా నిర్మించారు. ఈ సినిమా విషయానికి వస్తే తాజాగా అనసూయ ఈ సినిమా కోసం తీసుకున్న రెమ్యూనరేషన్ ఎంత తీసుకుందనే విషయం చక్కర్లు కొడుతుంది. 17 రోజుల షెడ్యూల్ ఉన్న ఈ సినిమా షూటింగ్ కోసం అనసూయ కేవలం ఒక్క రోజుకు మాత్రమే రూ.1.5 లక్షలు తీసుకుందట. అంటే మొత్తంగా పాతిక లక్షలు వెనకేసుకున్నట్లు తెలుస్తోంది.