సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో తెలుగమ్మాయిలు ఎక్కువ కాలం పాటు నిలదొక్కుకోలేరు. కానీ ఒక తెలుగు అమ్మాయి సినిమా ఇండస్ట్రీలో నెట్టుకొస్తుందంటే అది ఎంతో గొప్ప విషయం.ఈ క్రమంలోనే ప్రయాణం సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన కల్పిక తన ప్రయాణాన్ని ఇప్పటివరకు కొనసాగిస్తూనే ఉంది. ఆ తరువాత జులాయి,సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు వంటి సినిమాల్లో నటించి మంచి గుర్తింపును సంపాదించుకుంది.
కల్పిక సినిమాలలో పోషించేది సపోర్టింగ్ పాత్రలే అయినా, సోషల్ మీడియాలో మాత్రం హీరోయిన్ కన్నా ఎక్కువ ఫాలోయింగ్ ను సంపాదించుకుంది. అందుకు కారణం ఈమె తరచు గ్లామరస్ ఫోటో షూట్ జరిపి ఆ ఫోటోలను సోషల్ మీడియా ద్వారా షేర్ చేయడమే. హీరోయిన్ లకి ఏ మాత్రం తగ్గకుండా తన గ్లామర్ ను పెంచుతూ గ్లామరస్ ఫోటోలను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకొని కుర్రకారు గుండెల్లో హీటు పుట్టిస్తుంటుంది.
తాజాగా ఈ ముద్దుగుమ్మ ఏకంగా మోనోకిని ధరించి ఆ ఫోటోని తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో అప్‌లోడ్ చేసింది. ఈ ఫోటో షేర్ చేసిన కేవలం కొంత సమయంలోనే సోషల్ మీడియాలో వైరల్ గా మారి ఎంతోమంది కుర్రకారు గుండెల్లో దడ పుట్టించేసింది. ప్రస్తుతం కల్పిక మోనోకిని ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.