బాలీవుడ్ సీనియర్ నటి, రాజకీయవేత్త,ప్రముఖ సీనియర్ హీరో భార్య అయిన జయాబచ్చన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నేడు జయాబచ్చన్ పుట్టిన రోజు కావడంతో తన కుమారుడు అభిషేక్ బచ్చన్ తన తల్లి అలనాటి అద్భుతమైన ఫోటోను సోషల్ మీడియా ద్వారా షేర్ చేస్తూ తన తల్లికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశారు.
అభిషేక్ బచ్చన్ ఇంస్టాగ్రామ్ ద్వారా “పుట్టినరోజు శుభాకాంక్షలు అమ్మ. లవ్ యూ” అంటూ జయా బచ్చన్ అలనాటి ఫోటోను షేర్ చేశారు.అభిషేక్ బచ్చన్ షేర్ చేసిన ఈ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారి ఎంతోమంది నెటిజన్లను ఆకట్టుకుంది. ఈ ఫోటోలో జయా బచ్చన్ ఎంతో చూడముచ్చటగా ఉన్నారు.
అభిషేక్ బచ్చన్ సోషల్ మీడియా ద్వారా తన తల్లి ఫోటో షేర్ చేయగానే పలువురు సినీ హీరోలు స్పందించి తన తల్లికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఈ క్రమంలోనే హృతిక్ రోషన్ “హ్యాపీ బర్త్ డే ఆంటీ” అంటూ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. అయితే గత సంవత్సరం మాదిరిగానే ఈ ఏడాది కూడా కరోనా అధికంగా ఉండడంతో జయాబచ్చన్ పుట్టినరోజు వేడుకలు కేవలం కుటుంబ సభ్యుల సమక్షంలోనే జరగనున్నట్లు సమాచారం.