Mineral Water Plant Business : ఒకప్పుడంటే చాలా మంది బావుల్లో, చెరువుల్లో, నదుల్లో నీటిని తాగేవారు. కానీ ఇప్పుడు కాలం మారింది. ప్రతి ఒక్కరూ తమ ఆరోగ్యంపై శ్రద్ధ కనబరుస్తున్నారు. అందుకని చాలా మంది ప్రస్తుతం మినరల్ వాటర్‌ను తాగేందుకే ఇష్టపడుతున్నారు. ఈ క్రమంలోనే ప్రజలు నివాసం ఉండే ప్రాంతాలకు అతి సమీపంలో కొందరు మినరల్ వాటర్ ప్లాంట్లను పెట్టి వ్యాపారం చేస్తున్నారు. అయితే కొంచెం పెట్టుబడి పెట్టి.. కొద్దిగా శ్రమిస్తే.. ఎవరైనా సరే.. ఈ వ్యాపారం చేయవచ్చు. మరి ఈ వ్యాపారానికి పెట్టుబడి ఎంతవుతుందో.. ఈ బిజినెస్ ద్వారా ఎంత డబ్బును సంపాదించవచ్చో.. ఇప్పుడు తెలుసుకుందామా.
మినరల్ వాటర్ ప్లాంట్ పెట్టడానికి ముందుగా అనువైన స్థలం ఎంపిక చేసుకోవాలి. జనావాసాలకు దగ్గరగా ఉండేలా ప్లాంట్ పెడితే రవాణా ఖర్చులు తగ్గించుకోవచ్చు. అలాగే వాటర్ ప్లాంట్ పెట్టే స్థలంలో నీటి లభ్యతను, నీటి నాణ్యతను ముందుగా చెక్ చేసుకోవాలి. ఇక ప్లాంట్ పెట్టుకునేందుకు స్థానిక మున్సిపల్ ఆఫీస్‌లో లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకోవాలి. అలాగే FSSAI (Food Safety and Standards Authority of India), iso ల నుంచి పర్మిట్, సర్టిఫికెట్లను పొందాలి. దీంతో తరువాతి కాలంలో ఎలాంటి ఇబ్బంది లేకుండా వ్యాపారం సజావుగా సాగుతుంది. ఇలా అన్నీ తెలుసుకుని వ్యాపారం ప్రారంభిస్తే.. సుదీర్ఘ కాలం ఎలాంటి సమస్య లేకుండా వ్యాపారం కొనసాగించి.. లాభాల బాట పట్టవచ్చు.
మినరల్ వాటర్ ప్లాంట్‌ను ప్రారంభించేందుకు.. ముందుగా బోర్ వేయాలి. మీరు ఎంత నీటిని ప్యూరిఫై చేస్తారు..? ఎంత నీటిని నిత్యం సప్లయి చేయగలరు..? ఎంత నీటిని విక్రయించగలరు..? అని బేరీజు వేసుకుని ఆ మేర సామర్థ్యం ఉన్న బోర్లు వేసుకోవాలి. ఆ తరువాత వాటర్ ప్యూరిఫైర్‌ను ఏర్పాటు చేయాలి. ఇక బోర్ నీటిని, ప్యూరిఫై అయిన నీటిని స్టోర్ చేసేందుకు విడి విడిగా సంపులు లేదా వాటర్ ట్యాంకులను ఏర్పాటు చేసుకోవాలి. అలాగే వాటర్ ట్యాప్‌లు, వాటర్ క్యాన్స్, వాటర్ ఫిల్లింగ్ మెషిన్‌లు కూడా అవసరం అవుతాయి.
మినరల్ వాటర్ ప్లాంట్‌ను సహజంగా చాలా మంది షెడ్లలో ఏర్పాటు చేస్తుంటారు. అయితే ఇండ్ల వద్దే కావల్సినంత స్థలం ఉన్నవారు తమ ఇండ్లలోనే ఈ ప్లాంట్లను పెట్టుకోవచ్చు. దీంతో స్థలానికి అయ్యే ఖర్చు కలసి వస్తుంది. ఇక వాటర్ ప్లాంట్‌కు అవసరం అయ్యే విద్యుత్‌ను అందించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేసుకోవాలి. విద్యుత్ సరఫరాలో ఎలాంటి ఆటంకం ఉండకుండా చూసుకోవాలి. అవసరం ఉన్న మేర ప్రత్యేక లైన్‌ను కేవలం ప్లాంట్ కోసమే ఏర్పాటు చేసుకోవాలి. ఇక ఈ బిజినెస్‌ను ప్రారంభించేందుకు ఎంత పెట్టుబడి అవసరం అవుతుందో ఇప్పుడు చూద్దాం.
వాటర్ ప్యూరిఫైర్ ఖరీదు రూ.1.50 లక్షల నుంచి రూ.2 లక్షల వరకు ఉంటుంది. అయితే చిన్న మెషిన్లు మాత్రమే ఈ ఖరీదులో లభిస్తాయి. అదే పెద్దగా బిజినెస్ చేయాలనుకుంటే.. పెద్ద మెషిన్లను కొనుగోలు చేయాలి. అందుకు రూ.3 లక్షల నుంచి రూ.4 లక్షల వరకు ఖర్చవుతుంది. స్థోమత ఉన్నవారు పెద్ద మెషిన్లతో ఒకేసారి పెద్ద ఎత్తున బిజినెస్‌ను ప్రారంభించవచ్చు. ఇక ప్యూరిఫైర్ కాకుండా ఇతర సామగ్రికి రూ.30వేల నుంచి రూ.50వేల వరకు ఖర్చవుతుంది. అయితే ప్లాంట్‌కు సంబంధించి ప్యూరిఫైర్ తదితర మెషిన్లను ఆర్డర్ ఇస్తే కంపెనీ వారే వచ్చి బిగిస్తారు. ఆ తరువాత ప్లాంట్‌పై ఎలా పనిచేయాలో వారు వివరిస్తారు. ఇక తరువాతి రోజుల్లో ప్లాంట్‌లో ఏదైనా సమస్య వస్తే.. సదరు కంపెనీ కస్టమర్ కేర్‌కు కాల్ చేస్తే.. వారు టెక్నిషియన్లను పంపి సమస్యలను పరిష్కరిస్తారు.
బోర్ నుంచి నీటిని తీసుకునే ప్యూరిఫైర్ ఆ నీటిని శుద్ధి చేసి స్టోరేజ్‌ట్యాంకుల్లోకి పంపుతుంది. దీంతో నీరు ఆ ట్యాంకుల్లో స్టోర్ అవుతుంది. అక్కడి నుంచి వాటర్ ఫిల్లింగ్ మెషిన్ ద్వారా ఆ ట్యాంకుల్లోని నీటిని 20 లీటర్ల క్యాన్లలోకి నింపి సరఫరా చేస్తారు. ఇక ప్యూరిఫైర్ తో ఒక్కసారి 450 నుంచి 500 లీటర్ల వరకు నీటిని ప్యూరిఫై చేసేందుకు అవకాశం ఉంటుంది. అయితే నీటిని కూలెంట్ ద్వారా కూల్ చేసి కూల్ వాటర్‌ను కూడా సరఫరా చేయవచ్చు. ఈ క్రమంలో 15 లీటర్ల కూల్ వాటర్‌ను రూ.25 నుంచి రూ.30 వరకు విక్రయించవచ్చు. అదే నగరాల్లో అయితే రూ.40 వరకు విక్రయించవచ్చు.
మినరల్ వాటర్ ప్లాంట్ వ్యాపారం సహజంగా అన్ని రోజుల్లోనూ బాగానే ఉంటుంది. కాకపోతే వేసవిలో ఈ బిజినెస్ ఇంకా బాగా జరుగుతుంది. నీటిని ఎక్కువగా సప్లయి చేయగలిగితే ఎక్కువ లాభాలను వేసవిలో ఆర్జించవచ్చు. ఇక ఒక మోస్తరు పట్టణాలు, గ్రామాల్లో 20 లీటర్ల వాటర్ క్యాన్‌ను రూ.5 నుంచి రూ.10 వరకు, అదే సిటీల్లో అయితే రూ.35 వరకు విక్రయిస్తున్నారు. అదే కూల్ వాటర్ అయితే రూ.25 నుంచి రూ.40 వరకు విక్రయిస్తున్నారు. ఇక నీటిని హోం డెలివరీ చేస్తే అదనంగా మరో రూ.5 నుంచి రూ.10 వరకు ఎక్స్‌ట్రా వసూలు చేయవచ్చు. ఇక నార్మల్ వాటర్ క్యాన్‌పై రూ.4 వరకు ఖర్చు అయితే రూ.6 నుంచి లాభం పొందవచ్చు. అదే కూల్ వాటర్ క్యాన్ అయితే రూ.10 నుంచి లాభం పొందవచ్చు.
ఇక రోజుకు 200 నార్మల్ వాటర్ క్యాన్లను అమ్మితే లాభం కనీసం రూ.6 అనుకుంటే.. రోజుకు 200 * రూ.6 = రూ.1200 వరకు.. నెలకు 30 * 1200 = రూ.36,000 లాభం వస్తుంది. అదే రోజూ కనీసం 50 కూల్ వాటర్ క్యాన్లను అమ్మినా.. లాభం కనీసం రూ.10 అనుకుంటే.. 50 * 10 = రూ.500 నెలకు 30 * 500 = రూ.15,000 లాభం వస్తుంది. ఈ క్రమంలో నెలకు రెండు మొత్తాలు కలిపి రూ.36,000 + రూ.15,000 = రూ.51,000 వరకు సంపాదించవచ్చు. అయితే పెద్ద మెషిన్లతో బిజినెస్ ప్రారంభిస్తే.. ఇంకా ఎక్కువ మొత్తంలో వాటర్ క్యాన్లను అమ్మి.. ఆ మేర లాభాలను ఆర్జించవచ్చు.
ఇక మినరల్ వాటర్ ప్లాంట్ బిజినెస్ పెట్టేవారు వ్యాపారాన్ని పబ్లిసిటీ కూడా చేసుకోవాలి. అందుకు గాను వారు వార్తా పత్రికలు, స్థానిక కేబుల్ టీవీ చానల్స్, సినిమా థియేటర్లు.. తదితర మాధ్యమాల్లో బిజినెస్ ప్రచారం చేసుకోవాలి. దీంతో వ్యాపారం ఎక్కువగా వృద్ధి చెందుతుంది. అలాగే హోటళ్లు, రెస్టారెంట్లు.. ఇతర వ్యాపారులతో ఒప్పందం చేసుకుంటే.. బిజినెస్ డెవలప్ అవుతుంది. ఈ క్రమంలో ట్రాలీ ఆటోలను, మనుషులను పెట్టుకుంటే.. మినరల్ వాటర్‌ను రవాణా చేయడం సులభతరమవుతుంది. ఇలా ఈ వ్యాపారాన్ని ఎవరైనా లాభసాటిగా మార్చుకోవచ్చు.
మన శరీరంలో ఊపిరితిత్తులు ఎంత ముఖ్యమైనవో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఊపిరితిత్తులు దెబ్బతింటే శ్వాస తీసుకోవడం చాలా కష్టమవడంతోపాటు అతి తక్కువ…
ఇటీవలి కాలంలో వీధికుక్కల బెడద మరింత ఎక్కువైంది. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ రోడ్డుపై స్వేచ్ఛగా తిరిగేందుకు చాలా…
సాహో చిత్రంలో ప్రభాస్ సరసన కథానాయికగా నటించి అలరించిన శ్రద్ధా కపూర్ రీసెంట్‌గా స్త్రీ2 అనే మూవీతో పలకరించింది. 2018లో…
ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పెద్ద చిక్కుల్లో పడ్డాడు. జానీ మాస్టర్ తనను లైంగికంగా వేధించాడని రాయదుర్గం పోలీసులకు మహిళా…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాన్ ఇటు రాజకీయాలు, అటు సినిమాలు రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ ముందుకు సాగుతున్నారు. అయితే…
హారర్ సినిమా ప్రేమికుల్లో 'డీమాంటీ కాలనీ' సినిమాకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్న విషయం తెలిసిందే. తమిళ సినిమాయే అయినప్పటికీ...…
ఒక్కోసారి ఎవరిని ఎప్పుడు అదృష్టం ఎలా వరిస్తుందో తెలియదు. ఊహించని విధంగా లక్షాధికారి అవుతుంటారు. తుగ్గలి మండలం సూర్యతాండాలో రైతుకూలీకి…
ఈ రోజుల్లో బంధాలు ఎక్కువ కాలం కొనసాగడం లేదు. లక్షలు ఖర్చు పెట్టి ఎంతో అట్టహాసంగా పెళ్లి చేసుకుంటుండగా,ఆ పెళ్లి…