Business Idea : మనకు తినేందుకు అనేక రకాల స్నాక్స్ అందుబాటులో ఉన్నాయి. వాటిల్లో ఫ్రెంచ్ ఫ్రైస్ కూడా ఒకటి. వీటిని చిన్నారుల నుంచి పెద్దల వరకు చాలా మంది ఇష్టంగా తింటుంటారు. అయితే వీటిని తయారు చేసి విక్రయించడం ద్వారా ఎవరైనా సరే.. చక్కని స్వయం ఉపాధిని సొంతంగా కల్పించుకోవచ్చు. చాలా తక్కువ పెట్టుబడితోనే ఈ బిజినెస్‌లో నెల నెలా రూ.వేలల్లో సంపాదించుకోవచ్చు. మరి ఈ బిజినెస్ ఎలా చేయాలి..? అందుకు ఏమేం అవసరం అవుతాయి..? ఎంత పెట్టుబడి పెట్టాలి..? ఆదాయం ఎంత వస్తుంది..? అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందామా..!
ఫ్రెంచ్ ఫ్రైస్ స్టాల్ బిజినెస్‌కు పొటాటో ఫింగర్ చిప్స్‌ను కొనుగోలు చేయాలి. ఇవి మార్కెట్‌లో 2.50 కిలోలకు రూ.270 నుంచి రూ.305 వరకు లభిస్తాయి. అయితే మెషిన్ ఉంటే ఇంట్లోనే వీటిని తయారు చేసుకోవచ్చు. ఇక ఫ్రెంచ్ ఫ్రైస్‌ను తయారు చేసే మెషిన్ అవసరం అవుతుంది. దీని ధర రూ.3200 వరకు ఉంటుంది. 5 లీటర్ల సైజు మొదలుకొని 20 లీటర్ల సైజు వరకు భిన్న రకాల సైజుల్లో ఈ మెషిన్లు అందుబాటులో ఉన్నాయి. మెషిన్‌ను బట్టి ధర ఉంటుంది. పెద్ద సైజు మెషిన్ అయితే ఫ్రెంచ్ ఫ్రైస్‌ను ఎక్కువగా తయారు చేసి ఆ మేర లాభాలను పొందవచ్చు. ఇక వీటి తయారీకి ఆయిల్, చాట్ మసాలా, చిల్లీ పౌడర్, సాల్ట్ వంటివి అవసరం అవుతాయి. వీటిని ఎప్పటికప్పుడు కొనుగోలు చేయవచ్చు. అలాగే మెషిన్ రన్ అయ్యేందుకు గ్యాస్ లేదా కరెంట్ అవసరం అవుతుంది. ఇక తయారు చేసిన ఫ్రెంచ్ ఫ్రైస్‌ను విక్రయించేందుకు పేపర్ కప్స్ అవసరం అవుతాయి. వీటిని రూ.2 లేదా రూ.3కు ఒక కప్పు చొప్పున కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఈ క్రమంలో ఫ్రెంచ్ ఫ్రైస్ స్టాల్ పెట్టేందుకు దాదాపుగా రూ.10వేల వరకు ఖర్చు అవుతుంది.
ఇక స్టాల్‌ను ఎక్కువగా జనాలు రద్దీ ఉన్న ప్రాంతాల్లో పెడితే మంచి లాభాలు సంపాదించవచ్చు. సినిమా హాళ్లు, పార్కులు, ఇతర జన సాంద్రత ఎక్కువగా ఉండే ఏరియాల్లో పెడితే లాభాలు వస్తాయి. అయితే ఈ వ్యాపారానికి లోకల్ మున్సిపాలిటీ లేదా పంచాయతీ పర్మిషన్ ఉండాలి. అలాగే ఫుడ్ సేఫ్టీ అధికారుల నుంచి అనుమతి పొందాలి. రోడ్డు పక్కన ఈ స్టాల్ పెడితే ట్రాఫిక్ పోలీసుల పర్మిషన్ పొందాలి. దీంతో ఈ స్టాల్ ను ఎలాంటి ఆటంకం లేకుండా నడిపించవచ్చు.
ఫ్రెంచ్ ఫ్రైస్ స్టాల్ ద్వారా 100 గ్రాముల ఫ్రైస్ తయారు చేసేందుకు దాదాపుగా రూ.20 ఖర్చు అవుతుంది. కానీ వాటిని మనం 100 గ్రాములకు రూ.60 చొప్పున అమ్మవచ్చు. దీంతో రూ.40 లాభం వస్తుంది. ఇక నిత్యం 60 కప్పులను విక్రయించినా.. 60 * 40 = రూ.2400 వరకు నిత్యం సంపాదించవచ్చు. అదే నెలకు అయితే 2400 * 30 = రూ.72,000 వరకు సంపాదించవచ్చు. అయితే బిజినెస్ ఇంకా బాగా జరిగితే ఇంకా ఎక్కువగానే లాభాలు వస్తాయి. కానీ జనాలు ఎక్కువగా తిరిగే ప్రాంతాల్లో ఈ స్టాల్ పెడితే వ్యాపారం చక్కగా కొనసాగుతుంది. ఎక్కువ కాలం పాటు లాభాలను పొందవచ్చు.
మన శరీరంలో ఊపిరితిత్తులు ఎంత ముఖ్యమైనవో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఊపిరితిత్తులు దెబ్బతింటే శ్వాస తీసుకోవడం చాలా కష్టమవడంతోపాటు అతి తక్కువ…
ఇటీవలి కాలంలో వీధికుక్కల బెడద మరింత ఎక్కువైంది. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ రోడ్డుపై స్వేచ్ఛగా తిరిగేందుకు చాలా…
సాహో చిత్రంలో ప్రభాస్ సరసన కథానాయికగా నటించి అలరించిన శ్రద్ధా కపూర్ రీసెంట్‌గా స్త్రీ2 అనే మూవీతో పలకరించింది. 2018లో…
ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పెద్ద చిక్కుల్లో పడ్డాడు. జానీ మాస్టర్ తనను లైంగికంగా వేధించాడని రాయదుర్గం పోలీసులకు మహిళా…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాన్ ఇటు రాజకీయాలు, అటు సినిమాలు రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ ముందుకు సాగుతున్నారు. అయితే…
హారర్ సినిమా ప్రేమికుల్లో 'డీమాంటీ కాలనీ' సినిమాకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్న విషయం తెలిసిందే. తమిళ సినిమాయే అయినప్పటికీ...…
ఒక్కోసారి ఎవరిని ఎప్పుడు అదృష్టం ఎలా వరిస్తుందో తెలియదు. ఊహించని విధంగా లక్షాధికారి అవుతుంటారు. తుగ్గలి మండలం సూర్యతాండాలో రైతుకూలీకి…
ఈ రోజుల్లో బంధాలు ఎక్కువ కాలం కొనసాగడం లేదు. లక్షలు ఖర్చు పెట్టి ఎంతో అట్టహాసంగా పెళ్లి చేసుకుంటుండగా,ఆ పెళ్లి…