Money : హిందూ ధర్మంలో వారంలో ఒక రోజును ఒక్కో దేవుడికి అంకితం చేసారు. గురువారాన్ని విష్ణువుకు అంకితం చేసారు. ఈ రోజున హిందూ ధర్మాల ప్రకారం పూజలు చేసి ఉపవాసం ఉండడం వల్ల శ్రీ హరి అనుగ్రహం మనకు లభిస్తుందని పండితులు చెబుతున్నారు. అలాగే ఈ రోజున శ్రీ మహా విష్ణువుతో పాటు లక్ష్మీదేవిని కూడా పూజించడం వల్ల జీవితంలో ఆర్థిక సమస్యలు తలెత్తవని డబ్బుకు లోటు ఉండదని పండితులు చెబుతున్నారు. హిందూ ధర్మాల ప్రకారం గురువారం నాడు విష్ణువును, బృహస్పతిని పూజించడం వల్ల ఇంట్లో ఆనందం, శాంతి, శ్రేయస్సు లభిస్తుంది. అలాగే వ్యాపారంలో,ఉద్యోగంలో కూడా ఉన్నత స్థాయిని చేరుకుంటారు. గురువారం నాడు ప్రత్యేక పూజలు, పరిహారాలు చేయడం వల్ల మనకు శుభ ఫలితాలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు.
శుభ ఫలితాల కొరకు గురువారం నాడు చేయాల్సిన పరిష్కారాలు, పూజల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. గురువారం నాడు ఉదయాన్నే స్నానం చేసి పసుపు రంగు దుస్తులు ధరించాలి. ముందుగా సూర్య భగవానుడుకి నీటిని సమర్పించాలి. తరువాత ఆచారాలకు అనుగుణంగా లక్ష్మీ నారాయణునిడి పూజించాలి. అలాగే విష్ణుమూర్తికి అష్ట దళాలను సమర్పించాలి. ఈ విధంగా పరిహారం చేయడం వల్ల విష్ణువు అనుగ్రహం మనకు లభిస్తుంది. ఇక ఆర్థిక సమస్యలతో బాధపడే వారు గురువారం నాడు విష్ణువుకు పూజ చేసే సమయంలో కొబ్బరికాయను సమర్పించాలి. పూజ అనంతరం ఈ కొబ్బరికాయను ఎరుపు లేదా పసుపు రంగు వస్త్రంలో మూట కట్టి సురక్షితంగా ఉంచాలి. ఇలా చేయడం వల్ల డబ్బు రావడం మొదలవుతుంది. ఆర్థిక సమస్యలు తీరతాయి. ఆనందం, సంపదలు కలుగుతాయి. అలాగే గురువారం నాడు విష్ణు మూర్తికి పాలల్లో కుంకుమ కలిపి ఆ పాలతో అభిషేకం చేయాలి.
ఇలా చేయడం వల్ల డబ్బు సంబంధిత సమస్యల నుండి విముక్తి కలుగుతుందని పండితులు చెబుతున్నారు. ఇక వ్యాపారంలో, ఉద్యోగంలో పురోగతి చెందాలనుకున్న వారు గురువారం నాడు లక్ష్మీ నారాయణ ఆలయానికి వెళ్లి విష్ణువును పూజించాలి. అలాగే లక్ష్మీ దేవికి 7 పసుపు ముద్దలను సమర్పించాలి. దీంతో శ్రీమహావిష్ణువు సంతుష్టుడై భక్తుల కోరికలను నెరవేరుస్తాడని పండితులు చెబుతున్నారు. ఈ విధంగా గురువారం నాడు పూజ చేయడం వల్ల శ్రీమహావిష్ణువు దయ, కృప ఎల్లప్పుడూ మనపై ఉంటుందని ఆర్థికంగా ఎటువంటి సమస్యలు ఉండవని పండితులు తెలియజేస్తున్నారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…