బిజినెస్ ఐడియాలు

Business Idea : మొబైల్ రెస్టారెంట్ బిజినెస్‌.. నెల‌కు ల‌క్ష‌లు సంపాదించ‌వ‌చ్చు..!

Business Idea : రోజు రోజుకీ మారుతున్న జీవ‌న ప్ర‌మాణాల‌కు అనుగుణంగానే.. ప్ర‌జ‌ల ఆహార‌పు అల‌వాట్లు కూడా మారుతున్నాయి. అందుక‌నే భోజ‌న ప్రియుల సంఖ్య కూడా పెరిగిపోతోంది. చాలా మంది భిన్న‌ర‌కాల ఆహారాల‌ను ట్రై చేసేందుకు ఆస‌క్తి చూపుతున్నారు. అందుక‌నే ఇప్పుడు న‌గరాల‌తోపాటు ప‌ట్ట‌ణాల్లోనూ మొబైల్ క్యాంటీన్లు పెరిగిపోయాయి. త‌క్కువ ధ‌ర‌ల‌కే రుచిక‌ర‌మైన‌.. భిన్న ర‌కాల వంట‌కాల‌ను మ‌న‌కు వారు అందిస్తున్నారు. అలాగే నిరుద్యోగుల‌కు, మ‌హిళ‌ల‌కు ఈ వ్యాపారం చ‌క్క‌ని స్వ‌యం ఉపాధిని క‌ల్పిస్తోంది. అయితే.. నిజానికి ఎవ‌రైనా స‌రే.. ఫుడ్‌ ట్రక్‌, మొబైల్ క్యాంటీన్ బిజినెస్‌ను చేయ‌వ‌చ్చు. అందులో కొంత పెట్టుబ‌డి పెట్టి శ్ర‌మిస్తే.. లాభాల‌ను పొంద‌వ‌చ్చు. కాకపోతే కొంచెం పెట్టుబడి ఎక్కువే.. మ‌రి ఈ వ్యాపారానికి ఎంత పెట్టుబ‌డి అవ‌స‌రం అవుతుంది..? ఎంత వ‌ర‌కు ఆదాయం ల‌భిస్తుంది..? అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

మొబైల్ క్యాంటీన్ (రెస్టారెంట్ ఆన్ వీల్స్‌) బిజినెస్‌ను ప్రారంభించేందుకు అనువైన వాహ‌నాన్ని కొనుగోలు చేయాలి. అందుకు రూ.4 ల‌క్ష‌ల వ‌ర‌కు అవుతుంది. అలాగే క్యాంటీన్‌కు అవ‌స‌రం అయిన స్ట‌వ్‌, పాత్ర‌లు, ఇత‌ర సామ‌గ్రి, టేబుల్స్‌, చెయిర్స్ త‌దిత‌రాల‌ను కొనుగోలు చేసేందుకు రూ.2 ల‌క్షలు అవుతుంది. ఇక వంట‌కాల త‌యారీకి కావ‌ల్సిన ముడి ప‌దార్ధాల‌ను కొనుగోలు చేసేందుకు రూ.20వేల నుంచి రూ.30వేల వ‌ర‌కు అవుతుంది. ఇక క‌స్ట‌మ‌ర్ల నుంచి డిజిట‌ల్ ప‌ద్ధ‌తిలో పేమెంట్ల‌ను స్వీక‌రించేందుకు పీవోఎస్ మెషిన్‌ను త‌ప్ప‌నిస‌రిగా ఏర్పాటు చేసుకోవాలి. అందుకు మ‌రో రూ.30వేల వ‌ర‌కు అవుతుంది. దీనికి 6 నెల‌ల వ‌ర‌కు మ‌ళ్లీ ఎలాంటి రుసుం చెల్లించాల్సిన అవ‌స‌రం ఉండ‌దు. ఇక క్యాంటీన్‌లో ప‌నిచేసేందుకు మ్యాన్ ప‌వ‌ర్ అవ‌స‌రం అవుతుంది. నెల‌కు రూ.13వేల నుంచి రూ.15వేల‌కు ప‌నిచేసేలా సిబ్బందిని ఏర్పాటు చేసుకోవ‌చ్చు. ఆ త‌రువాత క్యాంటీన్ వ్యాపారాన్ని ప‌బ్లిసిటీ చేసేందుకు నెల‌కు రూ.20వేల వ‌ర‌కు ఖ‌ర్చు చేస్తే వ్యాపారం బాగా వృద్ధి చెందుతుంది. ఈ క్ర‌మంలో మొత్తం ఈ బిజినెస్ కోసం దాదాపుగా రూ.10 ల‌క్ష‌ల వ‌ర‌కు పెట్టుబ‌డి అవ‌స‌రం అవుతుంది. అయితే ఇంకా పెద్ద ఎత్తున బిజినెస్ చేయాలంటే.. అందుకు రూ.20 ల‌క్ష‌ల వ‌ర‌కు పెట్టుబ‌డి అవ‌స‌రం అవుతుంది.

Business Idea

ఇక మొబైల్ క్యాంటీన్ పెట్టాలంటే.. FSSAI లైసెన్స్‌, స్థానిక అగ్నిమాప‌క శాఖ అధికారుల నుంచి ఎన్‌వోసీ, లోక‌ల్ మున్సిప‌ల్ కార్యాల‌యం నుంచి వ్యాపారం చేసుకునేందుకు కావ‌ల్సిన అనుమ‌తి ప‌త్రం, వాహనాన్ని క‌మ‌ర్షియ‌ల్ ఉప‌యోగం కోసం వాడుతారు కనుక ఆర్‌టీవో నుంచి అందుకు సంబంధించిన అనుమ‌తి ప‌త్రాల‌ను తీసుకోవాల్సి ఉంటుంది. ఆ త‌రువాత మొబైల్ క్యాంటీన్ వ్యాపారం ప్రారంభించ‌వ‌చ్చు.

రూ.10 ల‌క్ష‌ల నుంచి రూ.20 ల‌క్ష‌ల వ‌ర‌కు పెట్టుబ‌డి పెట్టే సామ‌ర్థ్యం ఉన్న‌వారికి మొబైల్ క్యాంటీన్ వ్యాపారం చ‌క్క‌ని లాభాల‌ను ఇస్తుంద‌ని చెప్ప‌వ‌చ్చు. దీని వ‌ల్ల క్యాట‌రింగ్ ఆర్డ‌ర్ల‌ను కూడా తీసుకోవ‌చ్చు. అలాగే నిర్దిష్ట‌మైన స్థ‌లం అంటూ అవ‌స‌రం ఉండ‌దు క‌నుక‌.. జ‌నాలు బాగా ఉన్న ప్రాంతాల్లో వాహ‌నాల‌ను నిలిపి వ్యాపారం చేసుకోవ‌చ్చు. దీంతో ఏయే ప్రాంతాల్లో ఉండే జ‌నాలు ఏయే ర‌కాల ఆహారాల‌ను తింటారు..? వారు ఆహారం కోసం ఎంత వ‌ర‌కు వెచ్చిస్తారు..? అక్క‌డ మొబైల్ క్యాంటీన్ నిర్వ‌హ‌ణ‌కు వ్యాపార అవ‌కాశాలు ఇంకా ఏ విధంగా ఉంటాయి..? ఇంకా ఏమేం ర‌కాల వంట‌కాల‌ను స‌ద‌రు ప్రాంత వాసుల‌కు అందించ‌వ‌చ్చు..? అనే విష‌యాల‌ను చ‌క్క‌గా అర్థం చేసుకుని.. ఆ మేర మొబైల్ క్యాంటీన్‌ను నిర్వ‌హించ‌వ‌చ్చు. దీంతో వ్యాపారం ఎప్పుడూ సుస్థిరంగా కొన‌సాగి.. లాభాలు వ‌స్తూనే ఉంటాయి.

మొబైల్ క్యాంటీన్ వ్యాపారం పెట్టాల‌నుకునే వారు ముందుగా అందుకు కావ‌ల్సిన స్థ‌లాల‌ను ఎంపిక చేసుకోవాలి. జ‌నాలు బాగా ఉన్న ప్రాంతంలో ఈ వ్యాపారానికి మంచి డిమాండ్ ఉంటుంది క‌నుక‌.. ఆ మేర స్థ‌లాల‌ను ఎంపిక చేసుకోవాలి. అప్పుడ‌ప్పుడూ స్థ‌లాల‌ను మారుస్తూ ఉండాలి. దీంతో వ్యాపారంపై చాలా వ‌ర‌కు అవ‌గాహ‌న వ‌స్తుంది. ఇక క్యాంటీన్ వ‌ద్ద‌కు వ‌చ్చే భోజ‌న ప్రియులు త‌మ వాహ‌నాల‌ను పార్కింగ్ చేసుకునేందుకు కావ‌ల్సిన స్థ‌లం కూడా ఉండేలా ఏర్పాటు చేసుకుంటే ఉత్త‌మం. అలాగే క్యాంటీన్‌ను శుభ్ర‌మైన వాతావ‌ర‌ణంలో నిర్వ‌హించాలి. ప‌రిస‌రాలు ప‌రిశుభ్రంగా ఉండాలి. క్యాంటీన్‌లో వండే ఆహారాల‌ను శుచిగా, శుభ్రంగా క‌స్ట‌మ‌ర్ల‌కు అందివ్వాలి. భోజ‌నంలో నాణ్య‌త ఉండాలి. ఖ‌రీదు మ‌రీ ఎక్కువ‌గా ఉండ‌కూడ‌దు. రుచిగా వంట‌కాల‌ను అందించాలి. ఎప్పుడూ ఒకే ర‌క‌మైన వంటకాలు కాకుండా, ప‌లు ప్ర‌త్యేక‌మైన వంట‌కాల‌ను భోజ‌న ప్రియుల‌కు అందివ్వాలి. అలాగే త‌మ బ్రాండ్‌ను విస్త‌రించేందుకు త‌మ‌కే ప్ర‌త్యేక‌మ‌య్యేలా, త‌మ వ‌ద్దే ల‌భించేలా.. ఏవైనా ప్ర‌త్యేక వంట‌కాల‌ను క‌స్ట‌మ‌ర్ల‌కు అందివ్వాలి. దీంతో క‌స్ట‌మ‌ర్ల సంఖ్య బాగా పెరిగి వ్యాపారం అన‌తి కాలంలోనే వృద్ధి చెందుతుంది.

ఇక క్యాంటీన్‌ల‌ను నిర్వ‌హించే స‌మ‌యాలు కూడా ముఖ్య‌మే.. క‌నుక బ్రేక్‌ఫాస్ట్ అయితే ఉద‌యం స‌మ‌యంలో.. అదే భోజ‌నం అయితే మ‌ధ్యాహ్నం, రాత్రి స‌మ‌యాల్లో.. స్నాక్స్ అయితే సాయంత్రం స‌మ‌యాల్లో క్యాంటీన్‌ను నిర్వ‌హించాలి. మొబైల్ క్యాంటీన్ల‌ను ఎక్క‌డైనా నిర్వ‌హించే అవ‌కాశం ఉంటుంది క‌నుక‌.. వీలైనంత వ‌ర‌కు ఒకే ప్ర‌దేశంలో కొంత కాలం మొద‌ట‌గా వ్యాపారం చేయాలి. ఆ త‌రువాత వ్యాపారంలో వ‌చ్చే లాభాలు, జ‌నాలు ఎక్కువ‌గా ఉన్న ప్రాంతాల‌ను బ‌ట్టి క్యాంటీన్‌ను తిప్పుతూ వ్యాపారం చేయాలి. దీంతో త‌క్కువ కాలంలోనే ఈ బిజినెస్ ద్వారా లాభాల‌ను పొంద‌వ‌చ్చు.

ఇక ఈ వ్యాపారం ద్వారా నెల‌కు రూ.ల‌క్ష‌ల్లో సంపాదించేందుకు అవ‌కాశం ఉంటుంది. అది ఎవ‌రైనా స‌రే.. వారు పెట్టే పెట్టుబ‌డిని బ‌ట్టి ఉంటుంది. అలాగే మొబైల్ క్యాంటీన్‌ను నిర్వ‌హించే ప్ర‌దేశం.. అందించే ఆహారం.. జ‌న సాంద్ర‌త‌.. త‌దిత‌ర అంశాల‌ను బ‌ట్టి కూడా ఆదాయం మారుతుంది. అయితే ప్ర‌స్తుతం చాలా మంది మొబ‌ల్ రెస్టారెంట్ల య‌జ‌మానులు నిత్యం రూ.5వేలు మొద‌లుకొని రూ.25వేల వ‌ర‌కు సంపాదిస్తున్నారు. ఈ క్ర‌మంలో వ్యాపారం విజ‌య‌వంతం అయితే నెల‌కు ఎంత వ‌ర‌కు సంపాదించ‌వ‌చ్చో.. ఎవ‌రైనా.. ఇట్టే అర్థం చేసుకోవ‌చ్చు. అయితే ఈ బిజినెస్ ఒక్క‌సారి గ‌న‌క‌ విజ‌య‌వంతం అయితే.. నెల నెలా రూ. ల‌క్ష‌ల్లో మాత్రం క‌చ్చితంగా ఆదాయం వ‌స్తుంద‌ని చెప్ప‌వ‌చ్చు..!

Share
IDL Desk

Recent Posts

ఈ ఫుడ్ తింటే ఊపిరితిత్తులు నెల రోజుల్లో పూర్తి ఆరోగ్యంగా మారుతాయి..!

మన శరీరంలో ఊపిరితిత్తులు ఎంత ముఖ్య‌మైన‌వో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఊపిరితిత్తులు దెబ్బతింటే శ్వాస తీసుకోవడం చాలా కష్టమవడంతోపాటు అతి తక్కువ…

Monday, 23 September 2024, 5:22 PM

రోడ్డుపై కుక్క‌లు మిమ్మ‌ల్ని వెంబ‌డిస్తే ఆ స‌మ‌యంలో ఏం చేయాలి అంటే..?

ఇటీవలి కాలంలో వీధికుక్కల బెడద మ‌రింత ఎక్కువైంది. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ రోడ్డుపై స్వేచ్ఛగా తిరిగేందుకు చాలా…

Saturday, 21 September 2024, 3:01 PM

క‌లెక్ష‌న్ల‌లో దుమ్ము రేపుతున్న స్త్రీ 2 మూవీ.. బాలీవుడ్ లో ఆల్‌టైమ్ హై రికార్డు..!

సాహో చిత్రంలో ప్ర‌భాస్ స‌ర‌స‌న కథానాయిక‌గా న‌టించి అల‌రించిన శ్ర‌ద్ధా క‌పూర్ రీసెంట్‌గా స్త్రీ2 అనే మూవీతో ప‌ల‌క‌రించింది. 2018లో…

Saturday, 21 September 2024, 5:47 AM

జానీ మాస్ట‌ర్ కేసులో అస‌లు ఏం జ‌రుగుతోంది..?

ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పెద్ద చిక్కుల్లో ప‌డ్డాడు. జానీ మాస్టర్ తనను లైంగికంగా వేధించాడని రాయదుర్గం పోలీసులకు మ‌హిళా…

Friday, 20 September 2024, 9:27 PM

ప‌వ‌న్ క‌ళ్యాణ్‌తో ఇప్పుడు త‌న రిలేష‌న్ ఎలా ఉందో చెప్పిన ఆలీ..!

ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాన్ ఇటు రాజ‌కీయాలు, అటు సినిమాలు రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ ముందుకు సాగుతున్నారు. అయితే…

Friday, 20 September 2024, 9:42 AM

డీమోంట్ కాల‌నీ 2 ఓటీటీలోకి వ‌చ్చేస్తుంది.. ఎక్క‌డ, ఎప్పుడు అంటే..!

హారర్ సినిమా ప్రేమికుల్లో 'డీమాంటీ కాలనీ' సినిమాకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్న విష‌యం తెలిసిందే. తమిళ సినిమాయే అయినప్పటికీ...…

Thursday, 19 September 2024, 1:55 PM

పొలంలో రైతుకి దొరికిన రూ.5ల‌క్షల విలువైన వ‌జ్రం.. ఏకంగా జాక్ పాట్ త‌గిలిందిగా..!

ఒక్కోసారి ఎవ‌రిని ఎప్పుడు అదృష్టం ఎలా వ‌రిస్తుందో తెలియ‌దు. ఊహించ‌ని విధంగా ల‌క్షాధికారి అవుతుంటారు. తుగ్గలి మండలం సూర్యతాండాలో రైతుకూలీకి…

Wednesday, 18 September 2024, 10:46 AM

భ‌ర్త రోజూ స్నానం చేయ‌డం లేద‌ని ఏకంగా విడాకులు కోరిన భార్య‌

ఈ రోజుల్లో బంధాలు ఎక్కువ కాలం కొన‌సాగ‌డం లేదు. ల‌క్ష‌లు ఖ‌ర్చు పెట్టి ఎంతో అట్టహాసంగా పెళ్లి చేసుకుంటుండ‌గా,ఆ పెళ్లి…

Wednesday, 18 September 2024, 9:12 AM